CM YS Jagan : రిజిస్ట్రేషన్ లు బంద్.. జగన్ దాడులకు బెంబేలెత్తిపోతున్న రిజిస్ట్రేషన్ శాఖ

ఈ నేపథ్యంలో ఏసీబీ యాక్సన్ ప్లాన్ లోకి దిగింది. ఏకకాలంలో కార్యాలయాలపై దాడిచేసింది. ఏసీబీ తాజా చర్యలపై అభినందనలు వెల్లవెత్తుతున్నాయి.

Written By: Dharma, Updated On : April 28, 2023 2:50 pm
Follow us on

CM YS Jagan : ఏపీలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ డౌన్ కారణం చూపుతూ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. అయితే నిజంగా సాంకేతిక లోపమా? లేకుంటే ఇతరత్రా కారణాలు ఉన్నాయా? అన్నది చర్చనీయాంశమైంది. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కాల్ సెంటర్, మొబైల్ యాప్ కు వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. చివరకు తహసీల్దారు కార్యాలయాను సైతం ఆకస్మిక తనిఖీలు చేశారు. కొంతమంది అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫిర్యాదులతో…
మొన్నటివరకూ ఏసీబీ 14400 కాల్ సెంటర్, ఏ‌సి‌బి యాప్ కి వచ్చిన ఫిర్యాదులపై మాత్రమే సోదాలు జరిపారు. రెండు రోజుల కిందట కడప జిల్లా బద్వేలు, తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, విశాఖలోని జగదాంబ, కాకినాడ జిల్లా తుని. ఏలూరు జిల్లా నర్సాపురం, నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలపై ఏసీబీ అధికారులు గురిపెట్టారు. గుంటూరు జిల్లా మేడికొండ, శ్రీకాకుళం జిల్లా జలుమూరు తహసీల్దారు కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో కాల్ సెంటర్, యాప్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఆ భయంతోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక కారణాలు చూపుతూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచే రాష్ట్రంలో ఎక్కడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం లేదు. ఫైల్‌ కదలాలంటే డబ్బు.. ఆదాయ ధృవీకరణ పత్రం కావాలంటే లంచం.. కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే లంచం.. చివరకు చచ్చినోడిని ధృవీకరించాలన్నా లంచం అడిగే శవాలమీద పేలాలేరుకునే లంచగొండి అధికారుల దందా దడపుట్టిస్తోంది. దీనిపై ఏసీబీ కి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు హఠాత్తుగా ఏపీలోని సబ్ రిజిస్టర్, ఎమ్మార్వో కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి పలువురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.

స్వాగతిస్తున్న ప్రజలు
అవినీతి అధికారులు, ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ యాక్షన్ ప్లాన్ లోకి దిగడం శుభ పరిణామంగా చెప్పుకుంటున్నారు. ఫైల్‌ కదలాలంటే డబ్బు.. ఆదాయ ధృవీకరణ పత్రం కావాలంటే లంచం.. కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే లంచం.. చివరకు చచ్చినోడిని ధృవీకరించాలన్నా లంచం అడిగే శవాలమీద పేలాలేరుకునే లంచగొండి అధికారుల దందా దడపుట్టిస్తోంది. దీనిపై ఏసీబీ కి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు హఠాత్తుగా ఏపీలోని సబ్ రిజిస్టర్, ఎమ్మార్వో కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి పలువురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు.

ఎట్టకేలకు యాక్షన్ లోకి..
ఏడాది కిందట ఏసీబీని బలోపేతం చేస్తూ వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏసీబీ 14400 కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు ఏసీబీ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఏడాది గడుస్తున్నా ఏసీబీ యాక్షన్ లేకపోయేసరికి సర్వత్రా విమర్శలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ యాక్సన్ ప్లాన్ లోకి దిగింది. ఏకకాలంలో కార్యాలయాలపై దాడిచేసింది. ఏసీబీ తాజా చర్యలపై అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. దీంతో అటు మొబైల్ యాప్ పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. 14400 కాల్ సెంటర్ కు సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి.