కాంగ్రెస్ విలాపం: రాష్ట్రాల్లో సీట్లు ఇచ్చేవారే లేరా?

రాజులు పోయినా రాజ్యాలు పోవన్నది పాత సామెత.. కానీ రాజులు లేకుంటే రాజ్యం నడిచే పరిస్థితి లేదన్నది కొత్త సామెత.. ముఖ్యంగా రాజకీయాల్లో ఏ పార్టీకైనా సరైన నాయకుడు లేకుంటే ఆ పార్టీ అధ్వాన్న స్థితికి చేరుతుందనడానికి కాంగ్రెస్సే ఉదాహరణ. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకులు ఉండేవారు. దీంతో ఆ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రాగలిగింది. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పార్టీని తట్టుకొని నిలబడే నాయకుడు కాంగ్రెస్ కు […]

Written By: NARESH, Updated On : November 21, 2020 11:13 am
Follow us on

రాజులు పోయినా రాజ్యాలు పోవన్నది పాత సామెత.. కానీ రాజులు లేకుంటే రాజ్యం నడిచే పరిస్థితి లేదన్నది కొత్త సామెత.. ముఖ్యంగా రాజకీయాల్లో ఏ పార్టీకైనా సరైన నాయకుడు లేకుంటే ఆ పార్టీ అధ్వాన్న స్థితికి చేరుతుందనడానికి కాంగ్రెస్సే ఉదాహరణ. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకులు ఉండేవారు. దీంతో ఆ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రాగలిగింది. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పార్టీని తట్టుకొని నిలబడే నాయకుడు కాంగ్రెస్ కు ఇంకా దొరకడం లేదు. దీంతో చిన్నా చితకా ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవుతోంది. ఒకప్పడు కాంగ్రెస్ అంటే సామాన్యుడికి సైతం చేతిగుర్తు అని తెలిసిన వారు ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా మరిచిపోయారు.

Also Read: మహిళల బ్యాంక్ అకౌంట్లలో రూ.3 లక్షలు వేస్తున్న మోదీ.. నిజమేనా..?

బీహార్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆర్జేడీ తో పొత్తులో భాగంగా 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీనికి ప్రధాన కారణం పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడమేనన్న చర్చ జరుగుతోంది. మొదటి నుంచి కుటుంబపార్టీగా పేరు మోసుకున్న కాంగ్రెస్ కు రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవిని అప్పగించాలని ప్రస్తుత అధ్యక్షురాలు ఎంతో ప్రయత్నిస్తోంది. అయితే రాహుల్ బీజేపీని ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు. దీంతో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ చతికిలపడుతోంది. ఇక పార్టీలోని సీనియర్ నాయకులు ఒక్కతాటిపై ఉండకపోవడంతో పార్టీని పట్టించుకునేవారు కరువయ్యారు.

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ అంతకుముందు నుంచే డీఎంకే తో కాంగ్రెస్ కు పొత్తు ఉంది. బీహార్ లో కాంగ్రెస్ పరిస్థతిని చూశాక డీఎంకే నాయకులు పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు తక్కువ సీట్లను కేటాయించే పనిలో ఉన్నారట. 2015 ఎన్నికల్లో డీఎంకే కూటమి కాంగ్రెస్ కు 80 స్థానాలకు కేటాయించింది. ఇందులో 8 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈసారి 20 సీట్లకు మించి ఇవ్వరాదని డీఎంకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: బీజేపీ పాచిక: దేశంలో మరో మూడు కొత్త రాష్ట్రాలు..!

అయితే కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల కంటే ఎక్కువే ఇవ్వాలని పట్టుదలతో ఉందట. కానీ తన మాట వినకపోతే అవసరమైతే పొత్తు రద్దు చేసుకునేందుకు వెనుకాడమని డీఎంకే నాయకులు అనుకుంటున్నారట. కాగా కాంగ్రెస్ కు ఇప్పడున్న పరిస్థితుల్లో ఒంటరిగా వెళితే చేదు అనుభవం తప్పదని విశ్లేషకులు సూచిస్తున్నారు. డీఎంకే కూటమి కేటాయించిన సీట్లలో గట్టిగా ప్రచారం చేసి గెలిస్తే.. ఒకవేళ డీఎంకే ప్రభుత్వం ఏర్పడినా గౌరవప్రదంగా ఉంటుందని సూచిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి.