రికవరీ పెరుగుతున్నా.. మరణాలు తగ్గడం లేదా?

దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఒకటి.. రెండుతో మొదలై పదులు వందలు దాటి లక్షలకు చేరింది. నెలలు గడుస్తున్న కొద్దీ రెట్టింపు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. జనవరి 30న ఫస్ట్‌ కరోనా కేసు నమోదైంది. అప్పటి నుంచి కరోనాను కంట్రోల్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నివిధాలా ప్రయత్నించినా పెద్దగా ఫలితాలు కనిపించలేదు. దీంతో మార్చి నుంచి లాక్‌డౌన్‌ షురూ చేసింది. Also Read: కరోనా తో రైల్వే సహాయ మంత్రి మృతి ప్రస్తుతం దేశంలో కేసుల […]

Written By: NARESH, Updated On : September 24, 2020 5:30 pm
Follow us on


దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఒకటి.. రెండుతో మొదలై పదులు వందలు దాటి లక్షలకు చేరింది. నెలలు గడుస్తున్న కొద్దీ రెట్టింపు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. జనవరి 30న ఫస్ట్‌ కరోనా కేసు నమోదైంది. అప్పటి నుంచి కరోనాను కంట్రోల్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నివిధాలా ప్రయత్నించినా పెద్దగా ఫలితాలు కనిపించలేదు. దీంతో మార్చి నుంచి లాక్‌డౌన్‌ షురూ చేసింది.

Also Read: కరోనా తో రైల్వే సహాయ మంత్రి మృతి

ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య 57,32,518కు చేరినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,56,569 టెస్టులు చేయగా.. వీటిలో 86,507 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇప్పటికే 46,74,000 మంది కోలుకోగా.. మరో 9,66,000 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా మరణిస్తున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. రోజు దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న మరో 1129 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 91,149 చేరింది. కార్పొరేట్‌ వైద్యం పొందే స్థాయిలో ఉన్న ఎంపీలు కూడా ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కేంద్ర మంత్రి కూడా ప్రాణాలు కోల్పోవడం వైరస్‌ తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

దేశంలో కరోనా ప్రభావం తగ్గిపోతోంది.. రికవరీ రేటు పెరుగుతోందని ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలు చేస్తోంది. కానీ.. కరోనా మాత్రం చాప కింద నీరులా విజృంభిస్తూనే ఉంది. ప్రజల ప్రాణాలను హరిస్తూనే ఉంది. అసలు నిజం మాత్రం కరోనా పంజా చాలా తీవ్రంగా ఉంది. కొద్ది రోజుల్లోనే నలుగురు ఎంపీలు చనిపోయారు. వారిలో ఓ కేంద్రమంత్రి కూడా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందుకు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంత్ చనిపోగా.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముగ్గురు చనిపోయారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, కర్ణాటక రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ వారం వ్యవధిలో చనిపోగా.. తాజాగా కర్ణాటకకే చెందిన కేంద్ర మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఆయన కరోనా సోకే వరకూ అధికార విధుల్లో చురుగ్గా ఉన్నారు. కానీ కరోనా బారిన పడి.. ఎయిమ్స్‌లో చేరిన పది రోజులకే కన్నుమూశారు.

అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే ఎంపీలే ఇలా వరుసగా కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ఎంపీలతోపాటు వారి కుటుంబసభ్యులు.. వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా టెస్టులు చేశారు. అప్పుడే కొంత మందికి పాజిటివ్ వచ్చింది. అయితే.. ఆ తర్వాత కూడా సభలో అనేక మందికి నిర్ధారణ అయింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కూడా సోకింది. దీంతో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అంచనా వేయలేకపోతున్నారు.

Also Read: ఇకనుండి N-95తో పాటలు వినవచ్చు…కాల్స్ మాట్లాడవచ్చు

మరోవైపు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వాలు వీలు కల్పించాయి. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నా.. అవి రాజకీయంగా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కేసులు పెట్టడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప.. అధికారికంగా ఎక్కడా అమలు చేయడం లేదు. ఈ క్రమంలో దేశంలో కోరనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రికవరీలు పెరిగిపోతున్నాయని చెబుతున్నా నాలుగైదు రోజుల తర్వాత కరోనా రోగులను ఇంటికి పంపేసి.. క్యూర్ అయిపోయిందని రిపోర్టులు రాసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నలుగురు ఎంపీలు కరోనా బారిన పడి మరణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో ప్రజల కోణం నుంచి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది.