https://oktelugu.com/

BP Sugar in Telangana: తెలంగాణ ప్రజలకు బీపీ, షుగర్ పెరగడానికి కారణాలేంటి?

BP Sugar in Telangana: దేశంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మధుమేహం, రక్తపోటు రోగాలు విస్తరిస్తున్నాయి. దీంతో హెల్త్ ఆఫ్ దినేషన్ నివేదిక వెల్లడించిన సమాచారం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెంచుకుంటున్నాయి. దేశంలో రక్తపోటు వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. తెలంగాణలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ మేరకు అపోలో ఆస్పత్రి వెల్లడించిన నిజాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 7, 2022 / 12:41 PM IST
    Follow us on

    BP Sugar in Telangana: దేశంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మధుమేహం, రక్తపోటు రోగాలు విస్తరిస్తున్నాయి. దీంతో హెల్త్ ఆఫ్ దినేషన్ నివేదిక వెల్లడించిన సమాచారం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెంచుకుంటున్నాయి. దేశంలో రక్తపోటు వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. తెలంగాణలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ మేరకు అపోలో ఆస్పత్రి వెల్లడించిన నిజాలు కూడా విస్తుపోయేలా ఉన్నాయి.

    BP Sugar in Telangana

    రక్తపోటు జాతీయ సగటు 8 శాతం కాగా తెలంగాణలో 8.18 నుంచి 11 శాతంగా ఉంటోంది. అడ్డుఅదుపు లేని తిండితో రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. ఏ జంతువుకు రాని రోగాలు మనిషికి వస్తున్నాయి. నూరేళ్లు ఎలాంటి రోగాలు రాకుండా జీవించాల్సిన శరీరాన్ని ముప్పై ఏళ్లుకే ముప్పతిప్పలు పెడుతున్నారు. బీపీ, షుగర్ తో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు రోగాల శాతం ఎక్కువగా కావడంతో ఆందోళన చెందుతున్నారు.

    Also Read: తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అధిష్టానం ఎందుకు నమ్మడం లేదు…!

    డయాబెటిస్ కైతే రాజధానిగా తెలంగాణ మారుతోంది. మధుమేహ రోగుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా దేశానికి డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెంచుతోంది. ఈ నేపథ్యంలో మధుమేహం 7శాతం, రక్తపోటు 8 శాతం, సీవోపీడీ, ఆస్తమా రెండు శాతం మేర పెరుగుతున్నట్లు అపోలో ఆస్పత్రి గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. దీంతో రోగాల బారిన పడిన వారికి ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.

    దేశవ్యాప్తంగా మధుమేహం, రక్తపోటు రోగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో చిన్న వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయి. తినే తిండిలో నియమాలు పాటించకపోవడంతోనే రోగాలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. విచ్చలవిడిగా సమయం లేకుండా తింటూ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నట్లు సమాచారం. తిండిపై అదుపు లేకపోతే కష్టమే అని వైద్యులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. అందుకే రోగాల విస్తరణ పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

    Also Read: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?

    Tags