Jagan Visits Sarada Peetham: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. దీంతో నేతల్లో కూడా ఆగ్రహం వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతోనే కాలం గడుపుతోంది. అవే రాబోయే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని బలంగా నమ్ముతున్నారు. ఇందుకోసమే నిధులు కేటాయించడం తరువాత మీట నొక్కడం ప్రజల ఖాతాల్లోకి డబ్బులు చేరడంతోనే కాలం గడచిపోతోంది.
దీంతో మంత్రులు సైతం కార్యక్రమాలు మరిచిపోయి సొంత పనులు చేసుకుంటున్నారు. దీంతో నేతలెవరో కూడా ప్రజలకు తెలియడం లేదు.కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రం ఆఫర్ ఇస్తున్నారు. ఎవరు పిలిచినా కాదనకుండా హాజరవుతున్నారు. చినజీయర్ స్వామి అయినా శారదా పీఠం అయినా ఆహ్వానం పంపితే కాదనకుండా వెళుతున్నారు.
శారదా పీఠంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సీఎం జగన్ ను ఆహ్వానించారు. దీనికి వెళ్లేందుకు కూడా జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పీఠాధిపతి స్వరూపానంద స్వామి అంటే జగన్ కు ప్రత్యేక అభిమానం ఉంది. దీంతో జగన్ శారద పీఠానికి వెళ్లి ఆశీస్సులు తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్వామీజీల మాటలు మాత్రం పాటించడంతో జగన్ కు దైవభక్తి ఎక్కువే అని చెబుతున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో మూడో దశ ముగిసినట్టేనా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా శారద పీఠానికి జగన్ పలుమార్లు వెళ్లినట్లు సమాచారం.దీంతో ఆయనకు భక్తి భావం ఎక్కువగా ఉండటంతో వారు పిలిస్తే తప్పకుండా ఆశ్రమాలను సందర్శిస్తుంటారు. కానీ సొంత పార్టీ నేతలకు మాత్రం అపాయింట్ మెంట్ ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో జగన్ కు ఇది మైనస్ పాయింట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే జగన్ సీఎం కావడానికి కూడా కారణం తామేనని శారద పీఠాధిపతి పలు మార్లు చెప్పినట్లు తెలిసిందే. అందుకే జగన్ అక్కడకు వెళతారనే వాదన కూడా తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో జగన్ శారద పీఠాన్ని సందర్శించడం వెనుక ఆంతర్యం ఇదేనని స్పష్టమవుతోంది.
Also Read: జగన్-చిరంజీవి భేటితో టాలీవుడ్ కు ఏం ప్రయోజనం లేదా?