UP Road Accident : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పించే విధంగా ఉంటే.. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరికొన్ని వీడియోలు భయాన్ని కలగజేస్తుంటాయి. ఈ కథనం కింది లింకులో ఉన్న ఈ వీడియో కూడా అలాంటిదే.
మనదేశంలో అతిపెద్ద రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ముందు వరసలో ఉంటుంది. ఈ రాష్ట్రంలో అనేకమైన నగరాలు ఉన్నాయి. ఆ నగరాలలో నిత్యం రద్దీ వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు ఆ రోడ్లమీద వేలాది వాహనాలు వెళుతుంటాయి. ఇందులో కొన్ని వాహనాలు అదుపుతప్పి కింద పడుతుంటాయి. ఆ సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తూ ఉంటుంది. అటువంటి సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ప్రాంతంలో పహడి గేట్ అనే పేరుతో ఒక కూడలి ఉంది. ఈ కూడలిలో ఓ బొలెరో వాహనం వెళ్తూ ఉంది. అదే సమయంలో భారీ లోడుతో వెళ్తున్న లారీ వచ్చింది. యూటర్న్ తీసుకునే క్రమంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఆ లారి ఒక్కసారిగా కిందికి వంగింది. అలానే పడిపోయింది. ఆ లారీ కింద బొలేరో వాహనం ఉంది. ఆ వాహనం తోలుతున్న డ్రైవర్ సంఘటన స్థలంలోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.
ఆ రోడ్డు పక్కన ఉన్న వారంతా లారీ కింద పడిపోతున్న తీరు చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. లారీ కింద పడిపోయిన తర్వాత వెంటనే వారు అక్కడికి వచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. కన్ను మూసిన ఆ బోలెరో డ్రైవర్ ను బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.
యూ టర్న్ తీసుకునే విషయంలో లారీ డ్రైవర్ వ్యవహరించిన తీరు వల్లే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అంత పెద్ద వాహనాన్ని టర్న్ తీసుకోవడంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడని.. అతడు గనుక కొంత దూరం అలానే వెళ్ళిపోయి.. బైపాస్ లో టర్న్ తీసుకుంటే బాగుండేదని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ లారీ డ్రైవర్ చేసిన నిర్వాకం వల్ల ఇంత ఇబ్బంది ఏర్పడిందని స్థానికులు పేర్కొంటున్నారు.
WARNING: DISTURBING VISUAL
బొలెరో వాహనంపై పడిన లోడ్ లారీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్‌లోని పహాడీ గేట్ కూడలి వద్ద ఘటన
భారీ లోడ్‌తో వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం
ప్రమాదంలో బొలెరో డ్రైవర్ ఫిరాసత్ మృతి pic.twitter.com/kk970SktfQ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 29, 2025