Manisha Koirala: సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) తో కలిసి సినిమా చేయడం అనేది ప్రతీ నటుడికి ఒక కల. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సైతం ఆయన నోరు తెరిచి తన సినిమాలో ఒక్క చిన్న క్యామియో చేయమంటే, పైసా కూడా తీసుకోకుండా నటించే సూపర్ స్టార్స్ ఉన్నారు. ‘కూలీ’ చిత్రం తోనే మనం ఇది చూసాము. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే, రజినీకాంత్ సినిమా లో అవకాశం సంపాదించడమే తమ జీవిత లక్ష్యం అనే రేంజ్ లో ఉంటారు. ప్రస్తుతం ఆయన వయస్సు 74 ఏళ్ళు, ఇప్పటికీ అదే రేంజ్ క్రేజ్ ఆయనకు హీరోయిన్స్ లో ఉంది. ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించకపోయిన పర్వాలేదు, కనీసం ఒక పది నిముషాలు కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయనతో కలిసి నటిస్తే , ప్రపంచం మొత్తం చూస్తుంది. అందుకే ఆయనతో కలిసి నటించాలని అంత కోరుకుంటూ ఉంటారు.
అయితే అలాంటి సూపర్ స్టార్ తో కలిసి నటించడం వల్ల తన కెరీర్ నాశనం అయ్యింది అంటూ ఒక స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మరెవరో కాదు మనీష కొయిరాలా. ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి భారతీయుడు, ఒకే ఒక్కడు చిత్రాల ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ఇది కాసేపు పక్కన పెడితే ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ తో 2002 వ సంవత్సరం లో బాబా అనే చిత్రం చేసింది. ‘బాషా’ డైరెక్టర్ సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అప్పట్లో కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోవడం విఫలమైంది. వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న రజినీకాంత్ కి స్పీడ్ బ్రేకర్ గా నిల్చింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత ఆయన కోలుకొని మరో సినిమా చేయడానికి మూడేళ్ళ సమయం పట్టింది.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘బాబా’ మూవీ తాలూకు అనుభవాన్ని మనీషా పంచుకుంటూ ‘ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో నా కెరీర్ పై తీవ్ర ప్రభావం పడింది. ఆ చిత్రం కోసం ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ని కూడా వదిలేసుకున్నాను. కానీ విడుదల తర్వాత ఫ్లాప్ అవ్వడం తో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఒప్పుకున్న సినిమాలు కూడా వెనక్కి వెళ్లాయి. కెరీర్ నాశనం అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది ఈ నేపాల్ బ్యూటీ. అయితే ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, రీ రిలీజ్ లో మాత్రం సూపర్ అని చెప్పొచ్చు.