https://oktelugu.com/

Ramoji Rao – Radhakrishna : రామోజీరావు , రాధాకృష్ణ పాలసీ ఇదీ

Ramoji Rao – Radhakrishna : మార్గదర్శి కేసు… దీని మీద సిఐడి అధికారులు విచారణ చేస్తున్నప్పటికీ పచ్చ మీడియాలో వార్త కనిపించలేదు. కానీ యాదృచ్ఛికంగా ఆ పచ్చ మీడియా గ్రూపులో రెండవ పత్రిక అయిన ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తగా కనిపించింది. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. రామోజీరావు మీద విచారణ జరిపితే రాధాకృష్ణ వార్త రాశాడా? అని అనుకుంటూ పేపర్ ఓపెన్ చేస్తే అందులో రాధాకృష్ణ తాలూకు స్పైసినెస్ కనిపించలేదు.. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి భూతద్దం వేసుకొని మరి […]

Written By: , Updated On : April 6, 2023 / 09:13 AM IST
Follow us on

Ramoji Rao – Radhakrishna : మార్గదర్శి కేసు… దీని మీద సిఐడి అధికారులు విచారణ చేస్తున్నప్పటికీ పచ్చ మీడియాలో వార్త కనిపించలేదు. కానీ యాదృచ్ఛికంగా ఆ పచ్చ మీడియా గ్రూపులో రెండవ పత్రిక అయిన ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తగా కనిపించింది. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. రామోజీరావు మీద విచారణ జరిపితే రాధాకృష్ణ వార్త రాశాడా? అని అనుకుంటూ పేపర్ ఓపెన్ చేస్తే అందులో రాధాకృష్ణ తాలూకు స్పైసినెస్ కనిపించలేదు.. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి భూతద్దం వేసుకొని మరి చూసే రాధాకృష్ణకు..రామోజీరావు నలుపు కనపడకపోవడం నిజంగా ఒకింత ఆశ్చర్యకరమే.

ఎస్.. మనవాడు, మన కులపోడు.. కాబట్టి వెనకేసుకు రావాలి. చంద్రబాబు నాయుడు ని పల్లెత్తు మాట అనేవాడిని వదిలిపెట్టకూడదు. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే దాన్ని ముంచేదాకా వదిలిపెట్టలేదు. 2014లో అధికారంలోకి వచ్చేందుకు కారణమైన పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టేందుకు వెనుకాడ లేదు. నరేంద్ర మోదీ పై ఇష్టానుసారంగా కథనాలు ప్రసారం చేసేందుకు వెనుకాడలేదు.. ఎందుకంటే అది పచ్చ మీడియా కాబట్టి.. దానికి కేవలం తన పచ్చ నాయకులు మాత్రమే కనిపిస్తారు కాబట్టి.. మిగతా వాళ్ళు అధికారంలోకి వస్తే పచ్చ మీడియా పప్పులు ఉడకవు కాబట్టి..

ఇప్పుడు మార్గదర్శి విషయంలోనూ పచ్చ మీడియా మిత్ర ధర్మాన్ని మాత్రమే పాటించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. అదే రామోజీ వ్యవస్థానంలో జగన్మోహన్ రెడ్డి కనుక ఉండి ఉండుంటే, లేక ఇతర నాయకులు ఉండి ఉంటుంటే రచ్చ రచ్చ చేసేది. తాటికాయంత అక్షరాలతో కథనాలు వండి వార్చేది. జనాలకు ఏదో జరిగిపోతోంది అనే భయాన్ని కలిగించేది. అసలు మార్గదర్శి కేసులో ఏం జరుగుతోంది అనేది ఇప్పటికీ పచ్చ మీడియా రాలేదు. సిఐడి జరుపుతున్న విచారణ గురించి రాయలేదు. కానీ మార్గదర్శికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం దర్జాగా రాసింది. చివరికి మంచం మీద పడుకొని ఉన్న రామోజీరావు ఫోటో రైట్ అప్ విషయంలోనూ పచ్చ మీడియా తన పైత్యాన్ని ప్రదర్శించింది. ” రామోజీరావు మంచం మీద పడుకొని ఉండగా జగన్ మీడియాలో ప్రసారం అయిన చిత్రం ఇది అని రాసుకుంటూ వచ్చింది.

మార్గదర్శి విషయంలో చందాదారుల నుంచి వసూలు చేసిన నగదును పక్కదారి పట్టించడం నిజమని సీఐడీ లెక్కలతో వాదిస్తోంది.. చందాదారులకు సరైన సమయంలో నగదు ఇవ్వకపోవడం నిజం అని ఉండవల్లి లాంటి నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చూపించారు. ఆ నగదు పైన ఐదు శాతం వడ్డీ ఇస్తామని మభ్యపెట్టింది నిజం.. ఫారం 12 సమర్పించకుండా, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు పాటించకుండా మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారం నడిపిస్తున్నది కూడా నిజం. కానీ ఇన్ని నిజాలు రాధాకృష్ణకు కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.. ఉదయం లేస్తే దమ్మున్న పత్రిక అని డబ్బాలు కొట్టే రాధాకృష్ణ… మరి రామోజీరావు విషయంలో ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నట్టు? ఇదేనా దమ్మున్న జర్నలిజం అంటూ నిలదీస్తున్నారు. సిఐడి అధికారులు ఇచ్చిన ప్రెస్ నోట్ వివరాలను ఎక్కడో ఒక మూలన ప్రచురించడం దేనికి నిదర్శనం? రామోజీరావు స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే ఇలానే రాసేవాడా? ఇలానే సైలెంట్ గా ఉండి ఉండేవాడా? అంటూ సొంత పత్రికలోనే వారే సోషల్ మీడియాలో నిలదీస్తూ ఇసడించుకుంటున్న పరిస్థితి నెలకొంది.

‘‘జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతున్నప్పుడు రాధాకృష్ణ ప్రచురించిన వార్తలు ఎన్ని? వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈనాడు పత్రిక ప్రచురించిన వ్యతిరేక కథనాలు ఎన్ని? ఉదయం మూసివేతకు, వార్త పేపర్ లో నష్టాలకు కారణం ఈనాడు కాదా? గిట్టని పత్రికను ఇబ్బంది పెట్టడంలో రామోజీరావు ఎలాంటి సైంధవ పాత్ర పోషిస్తాడో తెలియదా? అందుకే కదా సాక్షి వచ్చింది? ఆ రోజున సాక్షి రాకుంటే పాత్రికేయుల జీతాలు పెరిగేవా? అసలు ఈనాడు యాజమాన్యం పాత్రికేయులను కనీసం ఉద్యోగులుగా గుర్తించేదా? ఇదే వేమూరి రాధాకృష్ణ 11వ తారీకు జీతాలు ఇచ్చే విషయంలోనూ ఉద్యోగులను ఎన్ని ఇబ్బందులకు గురి చేసాడో తెలియదా? ’’ అన్న ప్రశ్నలు ఈ రెండు మీడియాల్లో పనిచేసి వారి చేత అవమానంగా గెంటివేయబడ్డ జర్నలిస్టుల నుంచి వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ సాక్షి సొక్కమని కాదు. కాకుంటే గేమ్ చేంజర్ అయింది. పచ్చ మీడియాకు చుక్కలు చూపించింది. అయితే ప్రస్తుతం మార్గదర్శి కేసులో జగన్ కాళ్ళకు ఎన్నో బంధనాల పడతాయి. వాటన్నింటినీ చేదించుకొని నిజాలు బయట పెట్టగలిగినప్పుడే జగన్ రామోజీరావు మీద గెలిచినట్టు. లేకుంటే పచ్చ మీడియా మరింత ఉదృతంగా మీసం మెలేస్తుంది. అదే సమయంలో మిత్ర ధర్మాన్ని పాటిస్తూ.. తమలోని నలుపును దాచేస్తుంది.. ఇతరులపై దర్జాగా రాళ్లు వేస్తుంది.