Ramoji Rao : నాట్ బిఫోర్ మి.. మేనేజ్ చేసే ఆ రామోజీరావు తెలివికి జోహార్లు

Ramoji Rao : మీడియా మొగల్ రామోజీరావు తెలుగు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి. అన్ని వ్యవస్థల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తులని ఏర్పాటు చేసుకున్న అపర మేధావి. పచ్చళ్ళ వ్యాపారంతో ప్రారంభమైన ఆయన వ్యాపార ప్రస్థానం.. ఈనాడుతో పతాక స్థాయికి చేరి మీడియా మొగల్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అటువంటి రామోజీరావును ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారం ఇబ్బందులకు గురి చేస్తోంది. సుమారు 17 ఏళ్లపాటు ఈ కేసు నుంచి బయట పడుతూ వచ్చిన […]

Written By: NARESH, Updated On : April 19, 2023 10:54 pm
Follow us on

Ramoji Rao : మీడియా మొగల్ రామోజీరావు తెలుగు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి. అన్ని వ్యవస్థల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తులని ఏర్పాటు చేసుకున్న అపర మేధావి. పచ్చళ్ళ వ్యాపారంతో ప్రారంభమైన ఆయన వ్యాపార ప్రస్థానం.. ఈనాడుతో పతాక స్థాయికి చేరి మీడియా మొగల్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అటువంటి రామోజీరావును ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారం ఇబ్బందులకు గురి చేస్తోంది. సుమారు 17 ఏళ్లపాటు ఈ కేసు నుంచి బయట పడుతూ వచ్చిన రామోజీరావు.. ఇప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

రామోజీరావు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక బ్రాండ్. ఒక మీడియా సంస్థ అధిపతిగా, వ్యాపారవేత్తగానే కాకుండా.. అంతకుమించి అన్నంతగా ఆయన తన పేరు ప్రఖ్యాతలను విస్తరించుకున్నారు. బలమైన రాజకీయ ప్రత్యర్థులను కూడా సునాయాసంగా ఎదుర్కొన్న ధైర్యశాలి రామోజీరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉండాలన్నది కొన్నాళ్లపాటు ఆయనే డిసైడ్ చేశారంటే అతిశయోక్తి కాదేమో. 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి.. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా చేసిన అందరి కంటే అత్యంత బలమైన వ్యక్తి. అటువంటి రాజశేఖర్ రెడ్డిని బలంగా ఢీ కొట్టి నిలబడ్డారు రామోజీరావు. రాజకీయంగా రామోజీరావు ఇబ్బందులకు గురి చేస్తుండడంతో తనకు అత్యంత ఆప్తుడైన అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు వేయించారు. ఆ కేసు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు గా కనిపిస్తోంది.

ముందుకు వెళ్ళనీయకుండా చేసిన రామోజీ..

మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అక్రమాలు జరుగుతున్నాయి అంటూ, డిపాజిటర్ల సొమ్ము అడ్డగోలుగా ఇతర మార్గాల్లోకి వెళుతోందన్న ఆరోపణలతో ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి సంస్థపై 2006లో కేసు ఫైల్ చేశారు. అప్పటికే రామోజీరావుతో వైరం ఉన్న నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి అరుణ్ కుమార్ కు అన్ని విధాలుగా సహకారాన్ని అందించారు. కేసుకు సంబంధించి అనేక వివరాలను, ఆధారాలను సేకరించే పనిని తనకు కావాల్సిన అధికారులకు అప్పగించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజశేఖర్ రెడ్డి మృతి చెందడం.. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు ఉండవల్లి అరుణ్ కుమార్ కు సహకారాన్ని అందించకపోవడంతో ఈ కేసు ముందుకు కదల్లేదు.

వ్యవస్థలపై పట్టు సాధించిన రామోజీరావు..

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉన్న రామోజీరావుతో సఖ్యత కోరుకోవడం తప్పనిసరి అన్నట్టుగా చేశారు. రామోజీరావుతో వైరం వల్ల ప్రభుత్వంపై బురదజల్లే విధంగా మీడియాలో కథనాలు వస్తాయన్న ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు సఖ్యంగానే ఉంటూ వచ్చాయి. ఒక్క పక్క రాజకీయపరమైన సానుకూల వాతావరణాన్ని కాకుండా.. కోర్టులోను తనకు కావాల్సిన వ్యక్తులను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడం ద్వారా తనను టచ్ చేయకుండా  రామోజీరావు చూసుకోగలుగుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. సుమారు 17 ఏళ్ల పాటు మార్గదర్శి కేసు ముందుకు వెళ్లలేదు అంటే దానికి కారణం ఆయన ఏర్పాటు చేసుకున్న బలమైన లాబీయింగ్ కు సంబంధించిన కోటరీగా చెబుతున్నారు పలువురు నిపుణులు. ప్రస్తుతం దేశంలోనే బలమైన వ్యక్తులుగా పేరుగాంచిన నరేంద్ర మోడీ, అమిత్ షా.. గోద్రా అల్లర్లు విషయంలో నిజ నిర్ధారణకు వచ్చిన కమిటీ ముందు అప్పట్లో మోడీ చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది. ఇదే కేసు విషయంలో ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. రాష్ట్ర బహిష్కరణకు గురి కావడంతో ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉన్నారు అమిత్ షా. వీరికే తప్పని ఇబ్బందులు.. రామోజీరావు దరిదాపులకు కూడా రావడం లేదు. వ్యవస్థలపై కమాండ్ సాధ్యం కాకపోవడం వల్లే నాడు మోడీ, అమిత్ షా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, బలమైన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, ప్రస్తుతం ఏపీలోనే అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించిన జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించినా.. కనీసం రామోజీరావును ఏమి చేయలేని పరిస్థితి. అంటే దీని వెనక రామోజీరావు సృష్టించుకున్న వ్యవస్థలు ఏ స్థాయిలో పని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

న్యాయవ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట..

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో రామోజీరావు దిట్ట అన్న భావన ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మార్గదర్శిపై కేసు కొట్టి వేయాలంటూ నాలుగు బెంచుల వద్దకు విచారణ వెళ్లిందంటే ఏ స్థాయిలో లాబీయింగ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. విభిన్న మార్గాల్లో  వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకుంటారు అన్న పేరు రామోజీరావుకు ఉంది. దీనికి ఆయన ప్రత్యేక ఫార్ములాను అనుసరిస్తారని ఆయనను దగ్గరగా చూసిన వాళ్ళు చెబుతారు. ఆయనలో ఉన్న ఆ గొప్పతనమే ఇన్నాళ్లు పాటు మార్గదర్శ సంస్థ దగ్గరకు రాలేకుండా ప్రభుత్వాలను చేసిందని చెబుతున్నారు.

ఇప్పుడు ఏం చేయనున్నారు..

సుమారు 17 ఏళ్లపాటు మార్గదర్శి కేసు ముందుకు వెళ్లకుండా చేయగలిగిన రామోజీరావు.. తాజా కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ఏం చేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లపాటు ఈ కేసుకు సంబంధించి పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఈ కేసులో ఇంప్లీడ్ కాలేదు. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లిడ్ కావడంతోపాటు రామోజీరావును చుట్టుముట్టేందుకు అవసరమైన ఆధారాలను సేకరించారు. ఈ కేసుకు సంబంధించి పలువురుని అరెస్టు కూడా చేసింది ఏపీ సిఐడి. రామోజీరావు జీవిత చరిత్రలో కనీ.. వినీ ఎరుగని విధంగా.. ఏపీ సిఐడి పోలీసులు ఆయన ఇంటి గడప తొక్కి విచారణ చేశారు. ఈ నేపథ్యంలో రామోజీరావు తదుపరి వ్యూహం ఎలా ఉంటుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. తన మాస్టర్ మైండ్ తో ఇన్నాళ్ళు ఈ కేసు నుంచి బయట పడుతూ వచ్చిన రామోజీరావు.. ప్రస్తుత పరిస్థితిని ఎలా డీల్ చేస్తారో చూడాల్సి ఉంది.