Ram Gopal Varma- Pawan Kalyan: సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) మరో బాంబ్ పేల్చాడు. సమాజంలో జరిగే ప్రతీ సంఘటనపై స్పందించే ఆర్చీవీ.. ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో కలగజేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కు సపోర్టుగా ఓ సినిమాను తీచి చర్చల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇప్పుడు నేరుగా సంచలనాల వ్యాఖ్యలు చేశాడు. రాజకీయ విమర్శల్లో ఆర్జీవి కలగజేసుకొని పవన్ పై విరుచుకుపడ్డాడు. వలంటీర్ల విషయంలో పవన్ ఏదో అన్నాడని, అతనిపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆర్జీజి చెప్పుకొచ్చాడు. తాజాగా ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ‘మోసగాళ్లను వెనుకేస్తున్న ఆర్జీవికి పవన్ పై ఎందుకంత కోపం?’అంటే కామెంట్ల వరద పారిస్తున్నారు.
సినీ ఇండస్ట్రీకి చెందిన ఆర్జీవీ రాజకీయాల్లోకి వచ్చేసరికి వన్ సైడ్ మాత్రమే మాట్లాడుతారని కొందరు అంటుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని చిరంజీవి, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తారని ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల నుంచి పవన్ ను టార్గెట్ చేసి ప్రజల్లో ఆయన గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అంటున్నారు. ప్రజల కోసం నిత్యం పోరాడుతున్న పవన్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఆర్జీవి ఆయనకు సంబంధించిన ఏదో విషయాన్ని రాద్దాంతం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.
తాజాగా ఆర్జీవి మాట్లాడుతూ పవన్ వలంటీర్లను అమ్మాయిల బ్రోకర్లు అన్నాడని, దీంతో పవన్ పై కేసు పెట్టాలని వారిని రెచ్చగొడుతున్నాడు. సినిమాల్లోనే తన క్రూయిల్ మైండ్ ను ఉపయోగించే ఆర్జీవీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఏపీ రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని అంటున్నారు. తన మైండ్ సెట్ ఏవిధంగా ఉంటుందో తన సినిమాల ద్వారానే తెలుస్తుందని, ఇప్పుడు రియల్ గా గొడవలు సృష్టించేందుకు ఆర్జీవి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని అంటున్నారు.
అయితే ఆర్జీవి చేసిన ఈ కామెంట్లపై పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. సమాజంలో ఏం జరుగుతుందో తెలియని ఆర్జీవి ఇలాగే మాట్లాడుతారని అంటున్నారు. మోసగాళ్లకు వత్తాసు పలుకుతూ వారికి సపోర్టుగా ఉంటూ ఆర్జీవీ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తాను తీసిన సినిమా వ్యూహంపై తీవ్రం చర్చ సాగుతుండగా.. తాజాగా మరోసారి ఆర్జీవి కామెంట్స్ పొలిటికల్ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది.