Marriage Age: మహిళల వివాహ వయసు మరోసారి ప్రభుత్వం పెంచింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇకపై మహిళల వివాహ కనీస వయసు 21కి చేరడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇది మహిళలకు అన్ని రకాలుగా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురానుంది. దీంతో మహిళలకు పెళ్లి అర్హత వయసు కాలక్రమంలో మారుతూ వస్తోంది. గతంలో ఉన్న వయసు మారుతోంది.

భారతీయ చట్టంలో మహిళల వివాహ వయసుపై ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పూర్వం రోజుల్లో వయసును పెద్దగా పట్టించుకోక చిన్నతనంలోనే వివాహం చేసేవారు. దీంతో వారు ఎన్నో ఇబ్బందులకు గురయ్యే వారు. బాల్య వివాహాలతో వారి అభిప్రాయాలకు విలువ ఇచ్చే వారు కాదు దీంతో వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేవారు.
కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. నాగరికత మారుతోంది. దీనికి అనుగుణంగా వారి వివాహ వయసు కూడా మారాల్సిన అవసరం ఏర్పడుతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళల వివాహ వయసుపై స్వాతంత్ర్య ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు పలు మార్లు వయసును మార్చారు. ప్రస్తుతం 21కి మార్చడంతో మహిళా సాధికారత కూడా సాధించేందుకు వీలు ఉంటుందని తెలుస్తోంది. వారు జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని నేటి యువత భావిస్తోంది. దీనికి అనుగుణంగానే కేంద్రం వివాహ వయసు మార్చడంతో వారికి ప్రయోజనాలే ఎక్కువగా కలగనున్నాయి.
Also Read: AIG Hospitals up for sale: అమ్మకానికి మరో ప్రముఖ హాస్పిటల్స్ గ్రూప్.. డీల్ విలువ ఎంతంటే?
వివాహ కనీస వయసు ఒక్కో దేశంలో ఒకలా ఉంది. సౌదీ అరేబియా, యెమెన్ దేశాల్లో వివాహానికి కనీస వయసు లేదు. ఇరాన్, లెబనాన్, సుడాన్ దేశాల్లో 14 ఏళ్ల కంటే తక్కువే. కువైట్, అఫ్గనిస్తాన్, బహ్రెయిన్, పాకిస్తాన్, కతార్, యూకే దేశాల్లో 15 ఏళ్లకంటే పైనే, ఉత్తర కొరియా, సిరియా, ఉబ్జెకిస్తాన్ దేశాల్లో 17 ఏళ్లు, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, రష్యా, ఆస్రేలియా, నార్వే, స్వీడన్, యూఏఈ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, సింగపూర్, శ్రీలంక దేశాల్లో 18 ఏళ్లు, అల్జీరియా, దక్షిణ కొరియా దేశాల్లో 19 ఏళ్లు, చైనా, జపాన్, నేపాల్, థాయిలాండ్ దేశాల్లో 20 ఏళ్లు, ఇండోనేషియా, మలేషియా, నైజీరియా, పిలిప్పీన్స్ దేశాల్లో 21 ఏళ్లుగా కనీస వివాహ వయసు నిర్ధారించబడింది.