Homeజాతీయ వార్తలుRahul Gandhi Jodo Yatra : రాహుల్ ఎప్పుడు మారేది? జోడో యాత్రలో ఈ అసంబద్ధ...

Rahul Gandhi Jodo Yatra : రాహుల్ ఎప్పుడు మారేది? జోడో యాత్రలో ఈ అసంబద్ధ వ్యాఖ్యలేల?

Rahul Gandhi Jodo Yatra : నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. దానిపై అదుపు ఉంటేనే మనం మాట్లాడే మాటకు ఒక సార్ధకత ఉంటుంది. అలాంటి మాటకే ఒక విలువ ఉంటుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడితే అభాసు పాలు కావడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. దేశాన్ని ఏకం చేస్తా, మోడీని దించేస్తానని కంకణం కట్టుకుని జోడో యాత్ర చేపడుతున్న రాహుల్ గాంధీ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాటి ఇప్పుడు మహారాష్ట్రలో అడుగు పెట్టారు.  ఆ రాష్ట్రంలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సహకారంతో మహా వికాస్ అఘాడీ అనే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండేది. కానీ కుక్కలు చింపిన విస్తరి అయింది. ఇప్పుడు అక్కడ బిజెపి సంకీర్ణ ప్రభుత్వం షిండే సహకారంతో అధికారాన్ని ఏలుతోంది. ఈ దశలో అక్కడ అడుగుపెట్టిన రాహుల్ గాంధీ ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. గత మూడు రోజుల నుంచి అది దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది.
Congress Jodo Yatra
Rahul Gandhi
థాక్రే కు లబ్ధి చేకూరేలా..
మొసలి కోరుకున్నది జింకనే.. జింక వెళ్ళింది దాని పక్కకే.. అన్నట్టుగా ఆ సోకాల్డ్ మహా వికాస్ అఘాడీ కూటమి నా వల్ల కాదు అని కాడి ఎత్తేసేందుకే శివసేన చీఫ్ థాక్రే ఎదురు చూస్తున్నాడు. ఇదే సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాహుల్ గాంధీ అనుకోడు. కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు తెలియనివ్వరు.. ఇక రాహుల్ గాంధీ పక్కన ఉన్న జై రామ్ రమేష్ వంటి మేధావులు థాక్రే ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. గత ఎన్నికల్లో మహారాష్ట్ర లో ఎన్ని వింతలు జరిగాయో చూశాం కదా! ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సంజయ్ రౌత్ అనే మేధావి రంగంలోకి దిగి శివసేనకు ఎన్సీపీ తో బంధం కలిపాడు.. బిజెపిని కత్తిరించాడు.. కాంగ్రెస్ ను తెరపైకి తీసుకొచ్చాడు.. మొత్తానికి ఓ అతుకుల బొంత తయారు చేశారు.. థాక్రే భార్య రష్మి కోరిక మేరకు అతడిని ముఖ్యమంత్రి చేశాడు. కానీ ఏం జరిగింది.. భారతీయ జనతా పార్టీ షిండేని పట్టుకుని ఆ సో కాల్డ్ కూటమి ప్రభుత్వాన్ని కకావికలం చేసింది. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్న తీరుగా ఏకంగా శివసేన పార్టీకి ఎసరు పెట్టింది.. దెబ్బకు ఉద్ధవ్ థాక్రే కు 70 ఎంఎం సినిమా కనిపించింది..ఇప్పుడు ఆ రౌత్ వెంట లేడు. జైలు నుంచి విడుదలయ్యాక అమిత్ ను కలవాలి అంటున్నాడు. ఈ దెబ్బతో ఉద్ధవ్ కు మరింత క్లారిటీ వచ్చింది.. ఇక ఇప్పుడు అధికారం లేదు..అదే లేనప్పుడు ఈ సోకాల్డ్ కూటమి మాత్రం ఎందుకు? పైగా శివసేన తీసుకున్న యాంటీ హిందూ పోకడను కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా వారి ఓట్లు మొత్తం ప్రో హిందూ పార్టీకి వెళ్తాయి.. ఎప్పుడైతే కాంగ్రెస్ తో, ఎన్సిపి తో కలిశాడో అప్పుడే కేడర్ పక్కదారి పట్టింది. సో ఇప్పుడు ఆ ఓట్లు మొత్తం షిండే వైపు వెళ్తాయి.. అంటే రాను రాను శివసేనలో మరింత ముసలం ముదురుతుంది.. అంటే నిజ శివసేనకు, థాక్రే రాజకీయ జీవితానికి ముప్పు పొంచి ఉన్నట్టే.
జై రాం రమేష్ శల్యుడు
సావర్కర్ మీద రాహుల్ గాంధీ విమర్శల వెనుక  జై రాం రమేష్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ కూడా ఏ ఆలోచన చేయకుండా జనం ముందుకు వచ్చేసి మరో మాట లేకుండా చెప్పేస్తున్నాడు. ఎప్పుడైతే సావర్కర్ మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశాడో ఉద్ధవ్ కు ఒక సాకు దొరికింది. వెంటనే ఆ కూటమి నుంచి బయటికి వస్తానని సంకేతాలు వదిలాడు. ఇప్పుడు ఉన్న ఒత్తిడి నుంచి తాను కొంచెం ఉపశమనం కోరుకుంటున్నాడు. బిజెపిలో చేరేందుకు మళ్ళీ సంకేతాలు పంపుతున్నాడు.. కానీ అక్కడ ఉన్న షిండే ఇదంతా కుదరనివ్వడు.. వాస్తవానికి తాను బిజెపితో మాట్లాడుకున్నది వేరు. జైలు నుంచి సంజయ్ రౌత్ విడుదలైన తర్వాత చేసిన వ్యాఖ్యలు థాక్రే రాజకీయ పరిస్థితికి అడ్డం పడుతున్నాయి. “దేవేంద్ర కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాడు.. ఆయన ద్వారా ఢిల్లీ వెళ్లి బిజెపి నేతలు కలుస్తాను” అని సంజయ్ చెబుతున్నాడు అంటే జైల్లో సినిమా చూపించారనే కదా అర్థం!
జనం నమ్ముతారా
ఇవన్నీ పక్కన పెట్టి పార్టీ పటిష్ఠానికి చర్యలు తీసుకోవాలని ఉద్ధవ్ అనుకున్నా మహా జనం ఇప్పట్లో నమ్మేలా లేరు. ఇక ముఖ్యమంత్రి షిండే వదిలేలా లేడు.. ఈ స్థితిలో తనకు అచ్చి వచ్చిన హిందుత్వ విధానాన్ని ఉద్దవ్ ఆశ్రయిస్తాడు. వేరే మార్గం కూడా లేదు.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి పొగరుబోతు క్యాండెట్ కాళ్ళ బేరానికి వచ్చింది.. హేమంత్ సోరెన్ ఇప్పుడు బిక్క చూపులు చూస్తున్నాడు. మోడీ తో యుద్ధం అని మొన్న అన్నాడు. కానీ అంత ఈజీ కాదు. కెసిఆర్ లిక్కర్ స్కాం లో ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నాడు. అన్నట్టు సావర్కర్ గురించి రాహుల్ వీర లెవల్లో మాట్లాడాడు. కానీ దానివల్ల ఏం ఫాయిదా ఉన్నట్టు? కేరళ లో జోడో యాత్ర చేశాడు. అక్కడ యూడీఎఫ్ కూటమి చీలికలు పీలికలు అవుతున్నది. అన్నట్టు ఆ విషయం రాహుల్ కు తెలుసా? లేకుంటే జై రాం లాంటి వారు చెవిలో చెప్పాలా? భారత్ జోడో యాత్ర పేరుతో సానుకూలాన్ని ప్రోది చేసుకోవాలి గాని.. ఈ ప్రతికూల మాటలు ఏల రాహుల్! దేశాన్ని ఏకం చేయడం అంటే ఇదేనా?
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular