Rahul Gandhi Visit To Telangana: కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన బలం నిరూపించుకోవాలని చూస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తరువాత జరుగుతున్న పరిణామాలతో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఇక ప్రస్తుతం తెలంగాణలో పార్టీని మరోమారు అధికారంలోకి తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీని తెలంగాణ పర్యటనకు రావాలని ఆహ్వానించింది. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు ఆయన కూడా ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. మే 4, 5 తేదీల్లో ఆయన పర్యటన ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు సిద్ధమవతుున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో 4న వరంగల్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి రాహుల్ గాంధీ ప్రసంగించేలా ఏర్పాట్లు చేశారు.
Also Read: Pawan Kalyan: జగన్ పరిహారం.. ఒక పరిహాసం.. ప్రశ్నించిన పవన్
ఇక 5న బోయినిపల్లిలో పార్టీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అధినేత పర్యటన సజావుగా సాగేలా ప్లాన్ చేస్తున్నారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో పట్టు కోల్పోతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా పార్టీ పరిస్థితి అధ్వానంగా మారుతున్నందున నేతల్లో నూతనోత్సాహం నింపేందుకు రాహుల్ గాంధీ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

నేతల్లో ఉన్న అసంతృప్తులను దూరం చేసి సఖ్యత వచ్చేందుకు రాహుల్ గాంధీ పర్యటన దోహదపడుతుందని అందరు ఊహిస్తున్నారు. పార్టీని గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించినా సీనియర్లు మాత్రం దారికి రావడం లేదు. అందుకే ఇప్పుడు భారమంతా ఆయనపైనే వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అధిష్టానం తెలంగాణలో పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన పర్యటన పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం తెస్తుందని ఆశిస్తున్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కు ఇక కాలం చెల్లినట్లే అని తెలుస్తున్నందున రాహుల్ గాంధీ పర్యటనకు వస్తున్నట్లు సమాచారం. అయితే రాహుల్ గాంధీ పర్యటన నేతలకు మార్గదర్శనం చేయనున్నట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా రాహుల్ గాంధీ పర్యటనపై నేతల్లో భారీ ఆశలు పెట్టుకున్నారు.
Also Read:Nellore Politics: నెల్లూరులో కాక రేపుతున్న కాకాని.. అనిల్ యాదవ్ కు ముచ్చెమటలు