రాహుల్‌.. మనసు మార్చుకొని పగ్గాలు ‘చే’పట్టు..!

దేశ రాజకీయాల్లో ఇప్పటికే కాంగ్రెస్‌ పరిస్థితి అధ్వానంగా ఉంది. సరైన నాయకత్వం లేక.. సీనియర్ల మధ్య సయోధ్య లేక.. అంతర్గత కుమ్ములాటలు.. ఇలా ఒకటేమిటి ఆ పార్టీ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. వీటన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎవరినో ఒకరిని అధ్యక్షుడిని చేయాలంటూ రాహుల్ గాంధీ అగ్రనాయకత్వానికి చెబుతూ వస్తున్నారు. Also Read: చంద్రబాబు ఔట్-పవన్ కళ్యాణ్ ఇన్ ఇదే జరగబోతుంది.. మరోవైపు.. […]

Written By: Srinivas, Updated On : March 16, 2021 12:20 pm
Follow us on


దేశ రాజకీయాల్లో ఇప్పటికే కాంగ్రెస్‌ పరిస్థితి అధ్వానంగా ఉంది. సరైన నాయకత్వం లేక.. సీనియర్ల మధ్య సయోధ్య లేక.. అంతర్గత కుమ్ములాటలు.. ఇలా ఒకటేమిటి ఆ పార్టీ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. వీటన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎవరినో ఒకరిని అధ్యక్షుడిని చేయాలంటూ రాహుల్ గాంధీ అగ్రనాయకత్వానికి చెబుతూ వస్తున్నారు.

Also Read: చంద్రబాబు ఔట్-పవన్ కళ్యాణ్ ఇన్ ఇదే జరగబోతుంది..

మరోవైపు.. ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోపే అధ్యక్షుడిని నియమించి.. పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కానీ.. అలా కూడా చేయలేదు. ఇప్పుడు ఆ ఎన్నికలు పూర్తయ్యాక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎక్కువ మంది నేతలు రాహుల్ గాంధీనే తిరిగి అధ్యక్షుడిగా నియమించాలని ఒత్తిడి తెస్తున్నా ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు.

అయితే.. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్ప మరొకరు వచ్చినా ఏం చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొంచెం ఆశగా కన్పించేవి తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాలు మాత్రమే. పుదుచ్చేరి చిన్న రాష్ట్రం కావడంతో అక్కడ ఓడినా, గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలే లేవు.

Also Read: అస్సాంలో బీజేపీ కి గెలుపు అంత తేలిక కాదు

ఎన్నికల ఫలితాల అనంతరం కూడా కాంగ్రెస్ విజయం సాధించిందని రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు. ఫలితాలు ఎలా వచ్చినా రాహుల్ గాంధీ పదవిని చేపట్టాలనుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాన ప్రచారకర్తగా మారారు. సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో బయటకు రాలేకపోతుండంతో అంతా రాహుల్ గాంధీయే పర్యవేక్షిస్తున్నారు.

ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక అంతా రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఒకవేళ రాహుల్ గాంధీ కాకుండా కొత్త అధ్యక్షుడు వచ్చినా ఫలితం ఏముంటుందన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. కేవలం ఉత్సవ విగ్రహంలా ఉండాలే తప్ప ఏ పవరూ ఆయన చేతిలో ఉండదు. పార్టీని పరోక్షంగా రాహుల్ గాంధీయే శాసిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే రాహుల్ గాంధీయే అధ్యక్ష పదవిని చేపట్టాలని సీనియర్ నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్