Rahul Gandhi Mechanic: ప్రతీ విషయంలో సోషల్ మీడియా ఇప్పుడు ప్రముఖంగా నిలుస్తోంది. ఏదైన సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి అరచేతిలో మొబైల్ ఉంటే చాలు.. క్షణాల్లో అందరికి చేరుతుంది. దీనిని వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు బాగా వాడేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియా అండతోనే అధికారంలోకి వచ్చిందని అంటుంటారు. అప్పటి నుంచి ప్రతీ రాజకీయ పార్టీ ఫేస్బుక్, ట్విట్టర్ ను బాగా వాడేస్తోంది. తాజాగా సోషల్ మీడియా కాంగ్రెస్ బాగా యూజ్ చేసుకుంటోంది. ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నిత్యం అప్లోడ్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచుతోంది. అటు ప్రజలకు చేరువవుతోంది. తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ పిక్ వైరల్ అవుతోంది.
గత నెలలో కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ జోష్ లో ఉంది. వచ్చే 6 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. 2024లో జరిగే పార్లమెంట్ లోనూ పాగా వేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి చేర్చింది. ఎన్డీయేను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చింది. అయితే ఈ కూటమికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహిస్తుంది. అధికారం కోసం ఎలాగైనా ప్రజలను ఆకర్షించాలని పరితపిస్తోంది.
ఇందులో భాగంగా రాహుల్ గాంధీ వినూత్న పద్దతుల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. కొన్ని పనులు చేస్తూ వాటికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ మెకానిక్ షాపులో పనిచేస్తున్నట్లు ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బైక్ కు రిపేర్ చేస్తూ రాహుల గాంధీ సింప్లిసిటీ మెయింటేన్ చేస్తున్నారు.
రాజకీయ నాయకులు ప్రతీ ఎన్నికల్లో ఇలాంటి పనులు చేయడం కొత్తేమీ కాదు. కానీ జాతీయ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న రాహుల్ ఇలా చేయడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు రాహుల్ గాంధీ కి పగ్గాలు ఇస్తే పార్టి పరిస్థితి ఏంటి? అని భయపడిన వారు ఇప్పుడు పార్టీని రాహుల్ గాంధీ నే చక్కదిద్దుతున్నారని కొనియాడుతున్నారు. తన లైఫ్ ఎంత హైఫై ఉన్నా సామాన్య ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పేందుకే రాహుల్ గాంధీ ఇలా చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.