https://oktelugu.com/

వైసీపీ నేతలంతా..పందులు:రఘురామకృష్ణంరాజు

గత కొంతకాలంగా వైసీపీ నేతలు, ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. తనపై వైసీపీ నేతలు చేసిన విమర్శలపై ఆయన విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలంతా పందులు అన్నట్లుగా విమర్శకులు చేశారు. సింహం సింగిల్‌ గానే వస్తుందంటూ రజనీకాంత్‌ డైలాగ్‌ ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే తానూ చేస్తానని సవాల్‌ విసిరారు. తాజాగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను విమర్శించిన వాళ్లు జగన్‌ బొమ్మ పెట్టుకొని […]

Written By: , Updated On : June 16, 2020 / 08:15 PM IST
Follow us on

Raghu ramakrishnam raju

గత కొంతకాలంగా వైసీపీ నేతలు, ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. తనపై వైసీపీ నేతలు చేసిన విమర్శలపై ఆయన విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలంతా పందులు అన్నట్లుగా విమర్శకులు చేశారు. సింహం సింగిల్‌ గానే వస్తుందంటూ రజనీకాంత్‌ డైలాగ్‌ ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే తానూ చేస్తానని సవాల్‌ విసిరారు.

తాజాగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను విమర్శించిన వాళ్లు జగన్‌ బొమ్మ పెట్టుకొని గెలిచి చూపించాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో నాపై తిట్ల పర్వం కొనసాగించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఓ ఇసుక దొంగ‌. ఇళ్ల స్థలాల్లోనూ ఆయన రూ.కోట్లు దండుకున్నారు. సత్యనారాయణ అరాచకాల గురించి ఆయన మేనల్లుడే చెబుతారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు పైనా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ రావు కూడా సీఎం అపాయింట్‌ మెంట్‌ దొరక్క బాధపడ్డారు’’ అన్నారు.

ఆ ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలి
సీఎం జగన్‌ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందే చెప్పాను. ఆయన ఇంటికి వెళ్లడానికి నేను ఇష్టపడకపోతే ఎయిర్‌ పోర్టులో కలిశారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు హుందా గల వ్యక్తి. పార్టీ ఎమ్మెల్యేలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నా బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గిన  ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలి’’ అని రఘు రామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.