Al-Thani family
Al-Thani family: ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత్ లో పర్యటించారు. షేక్ తమీమ్ ఢిల్లీకి చేరుకోగానే భారత ప్రధాని మోడీ స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. గత పదేళ్ల కాలంలో మన దేశంలో ఆయనది మొదటి పర్యటన. షేక్ తమీమ్ పర్యటనను భారత్ కు చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. ఈ పర్యటనలో భారత్ – ఖతర్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అంశాలను గురించి చర్చించారు. వాటిలో వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ లాంటివి చర్చల్లో భాగం అవుతాయని పేర్కొన్నారు. వీటి వల్ల ఆయా రంగాలకు గట్టి ఊతం దొరుకుతుందని భావిస్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని డబుల్ చేస్తూ సుమారు రూ.2.43 లక్షల కోట్ల (28 బిలియన్ డాలర్ల)కు తీసుకువెళ్లాలని రెండు దేశాలు టార్గెట్ పెట్టుకున్నాయి. సంపన్న దేశాల్లో ఒకటైన ఖతర్ పాలకుడికి దిమ్మ తిరిగిపోయే ఆస్తిపాస్తులు ఉన్నాయట.
ఖతర్ దేశ పాలకుడిని సాధారణంగా అమీర్ అని పిలుస్తారు. హోదాలో అమీర్ ఉన్నట్లే ఆ దేశ పాలకుడు కూడా అమీరే. ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ప్రపంచంలోని ధనవంతుల్లో తొమ్మిదో రాజు. ఆయనకు దాదాపు 335 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 2023లో షేక్ తమీమ్ ఖతర్ అమీర్ అయ్యారు. దోహాలోని రాయల్ ప్యాలెస్‌లో నివసించే ఆయను ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తనుకు 13 మంది పిల్లలు ఉన్నారు. 100కి పైగా రూంలు, ఒక బాల్ రూమ్ ఉన్న ఈ ప్యాలెస్ విలువే దాదాపు ఓ బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఈ ప్యాలెస్ చాలా లగ్జరీగా ఉంటుంది. దీనిలోని కొన్ని భాగాలను బంగారం పూతతో చేశారట. ఈ ప్యాలెస్ లో 500 కార్లు పార్క్ చేసుకునే విధంగా నిర్మించారు. . ఈ ప్యాలెస్‌లో 124 మీటర్ల పొడవైన నౌక కూడా ఉంటుంది. దీని విలువ దాదాపు రూ.3.3 బిలియన్. ఈ రాజభవనంలో ఓ హెలిప్యాడ్ కూడా ఉంది.
షేక్ తమీమ్‌కు లగ్జరీ కార్లంటే అమితమైన ఇష్టం. తన దగ్గర రోల్స్ రాయిస్, బుగాట్టి, లంబోర్గిని, ఫెరారీ బ్రాండ్ వరకు చాలా మోడల్ కార్లు ఉన్నాయి. 1980 జూన్ 3న జన్మించిన షేక్ తమీమ్, మాజీ అమీర్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ నాలుగో సంతానం. లండన్‌లోని హారో స్కూల్‌లో షేక్ తమీమ్ స్టడీస్ పూర్తి చేశారు. 1998లో రాయల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. తనకు మూడు బోయింగ్ విమానాలతో కలిపి మొత్తం 14 చిన్న ఫ్లైట్స్ ఉన్నాయి. ఆ దేశానికి ప్రపంచంలో మూడో అతి పెద్ద గ్యాస్ నిల్వలు ఖతర్ దేశంలోనే ఉన్నాయి. గ్యాస్ నిల్వల్లో రష్యా మొదటి స్థానంలో, ఇరాన్ రెండో స్థానంలో ఉన్నాయి. ఖతర్ ఇతర దేశాలకు పెద్ద ఎత్తున సహజ వాయువును ఎగుమతి చేస్తుంటుంది.