Punjab elections: దేశంలో ఎన్నికలు వచ్చాయంటే చాలు వెంటనే దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయి. అధికార పార్టీ ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు జరుపుతుంటాయి. లేదా తమకు వ్యతిరేకంగా రెబల్ గా పోటీ చేసే అభ్యర్థులపై దాడులు జరుగుతుంటాయి. ఇక కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తమకు వ్యతిరేకంగా వచ్చి.. ఎదుగుతున్న లీడర్ల ఇళ్లపై, వారి బినామీలపై దాడులు జరుపుతుంటుంది. అలా ఏమైనా అక్రమాలు బయటపడితే వాటిని ప్రజలకు చూపించి ఎన్నికల్లో ఓట్లు కొల్లకొట్టేందుకు ప్లాన్ చేస్తుంటాయి. తాజాగా దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఈడీ సంస్థలు పంజాబ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి బంధువుల ఇళ్లపై సోదాలు జరుపుతోంది. ఈ అంశం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ దగ్గరి బంధువుల ఇళ్లల్లో దాదాపు పది చోట్ల సోదాలు జరిపారు. ఇసుక అక్రమ రవాణాలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలా సీఎం బంధువుల ఇళ్లను టార్గెట్ చేయడంపై సహజంగానే రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ ముఖ్య నేతల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఓ నేత ఇంట్లో రూ. 170 కోట్లకుపైగా నగదు పట్టుబడింది. తీరా చూస్తే ఆ వ్యాపారి సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు కాదని.. పేరులో కన్ఫ్యూజ్ వల్ల ఐటీ అధికారులు ఆయన ఇంటిపై దాడి చేశారని వెళ్లడైంది. తర్వాత అసలు వ్యక్తి ఇంట్లో దాడులు చేయగా ఏమీ దొరకలేదు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎన్నికల సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎలా దాడి చేశారో.. ఇప్పుడు అలాగే చేస్తున్నారని పంజాబ్ సీఎం మండిపడుతున్నారు.
Also Read: నాగార్జున.. బాలయ్య హీరోయిన్ కి ఓటేస్తాడా ?
ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు.. బీజేపీయేత పార్టీల నేతలపై జరగడం కామన్ అయిపోయింది. అందుకే విపక్ష పార్టీలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ మిత్రపక్షాలుగా అభివర్ణిస్తూ ఉంటాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అదే అదే విధంగా చెబుతూ వచ్చారు. అందుకే బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్‌ను రద్దు చేస్తున్నాయి. దీంతో ఈడీ, ఐటీలను కేంద్రం ఉపయోగించుకుంటోందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
|
|