PSLV C60 : ఇస్రో (ISRO) అమ్ములపొది నుంచి మరో రాకెట్ నింగిలోకి వెళ్లడానికి సర్వం సిద్దమైంది. పీఎస్ఎల్‌వీ సీ60 (PSLV C60) ప్రయోగానికి సమయం దగ్గర పడుతుంది. నెల్లూరు (Nellore) జిల్లా శ్రీహరి కోట (Srihari Kota)లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (Sathish Dhawan Space Center)లో ఈ ప్రయోగం జరగనుంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ60 (PSLV C60)కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. అయితే వాహక నౌక అటాచ్‌మెంట్ పూర్త అయినా తర్వాత వెంటనే టెక్నికల్ పరీక్షలను నిర్వహించారు శాస్త్రవేత్తలు. ఆ పరీక్షలు పూర్తయ్యాక రాకెట్ లాంఛింగ్‌ను చేయవచ్చని ధృవీకరించారు.
కాగా, PSLV C20 ప్రయోగానికి ఆదివారం రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సోమవారం రాత్రి అంటే ఈ రోజు రాత్రి 9.58 గంటలకు పీఎస్ఎల్వీ సీ60 (PSLV C60) నిర్ణీత కక్ష్యలోకి దూసుకెళ్లనుంది. SpaDeX వంటి కార్యక్రమాలతో అంతరిక్ష టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఇస్రో (ISRO) తన ప్రయత్నాలను చేస్తుంది. దీనివల్ల ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో పెరుగుతున్న భారత్ (India) పాత్రను విశ్వవ్యాప్తం చేయవచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఈ రాకెట్ ద్వారా SDX01 (ఛేజర్) , SDX02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపడానికి సిద్దం అయింది. ఒక్కొక్కటి సుమారు 220 కిలోల బరువు ఉంటుందని సమాచారం.. ఉపగ్రహాలను 470 కి.మీ ఎత్తులో వేరు వేరు కక్ష్యల్లో ప్రవేశపెడతారు.
ఇలా అన్నీ అనుకున్నట్లు జరిగి, నాలుగు దశల పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) సోమవారం రాత్రి 9:58 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరితే, అది MMRలోని మూడు సంస్థలకు గర్వకారణంగా నిలుస్తుంది. తుర్భేలో మనస్తు స్పేస్, ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో అమిటీ యూనివర్సిటీ, పూణేలోని MIT-వరల్డ్ పీస్ యూనివర్సిటీలు దీని కోసం వెయిట్ చేస్తున్నాయి.
అయితే ఇందులో ఈ సంస్థల పాత్ర ఏంటి అంటే? మనస్తు స్పేస్ ఉపగ్రహాల కోసం ప్రొపల్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఇక దీని ప్రయాణం IIT-బాంబేలో ప్రారంభమైంది. కంజుర్‌మార్గ్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో నిరాడంబరమైన సెటప్‌లో కొనసాగింది. ఇక ఈ ప్రయాణం తుర్భేలోని వారి సౌకర్యం వద్ద ముగిసింది. అయితే దీన్ని గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇది అల్యూమినియంతో తయారు చేశారు. కేవలం 10cmx10cmx20cm కొలుస్తుంది. సాంప్రదాయ ప్రొపల్షన్ సిస్టమ్‌లకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా ఉపగ్రహాలపై ఉపయోగిస్తారు.
మనస్తు స్పేస్ సహ-వ్యవస్థాపకుడు, CEO, IIT-బాంబే పూర్వ విద్యార్థి తుషార్ జాదవ్ మాట్లాడుతూ, DRDO వర్గీకృత సైనిక ఉపగ్రహాలలో వినియోగం కోసం ఇటీవలే ఇదే విధమైన ప్రొపల్షన్ సిస్టమ్‌ను అందించారని తెలిపారు. ఇక వారిది తక్కువ విషపూరితమైనదని, తక్కువ కార్యాచరణ ఖర్చులను కలిగి ఉందని, అధిక సామర్థ్యాన్ని అందిస్తుందని, ముఖ్యంగా చాలా సరసమైనది అని పేర్కొన్నారు.