Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అయిన వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ ఇక విజయసాయిరెడ్డికి లేనట్టేనని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే ఆ వైపుగా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు కూడా పడ్డాయి. తన వ్యూహాలతో పార్టీలో అంచెలంచెలుగా నంబర్ 2 స్థాయికి ఎదగిన విజయసాయిరెడ్డిని పార్టీలో కీలక బాధ్యతల నుంచి జగన్‌మోహన్‌రెడ్డి దూరం చేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతలు.. విశాఖపై నాయకత్వాన్ని కూడా ఆయన మెల్లిగా పక్కన పెట్టేశారు. దీంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒక్క ఢిల్లీకి తప్ప.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో తన పట్టు కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనకు జగన్ పార్టీలో ఏదైనా కీలక బాధ్యతలు అప్పగిస్తారా లేక.. దూరం పెడతారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
-హవా తగ్గించాలనే..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం. రాబోయే రోజుల్లో ఈమేరకు జగన్ ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి హవా తగ్గించాలని.. విశాఖ నాయకత్వానికి ఆయనను దూరం చేయాలని అంతర్గతంగా పెద్ద మంత్రాంగమే నడిచిందంటారు. విశాఖ కేంద్రంగా పార్టీ వ్యవహారాలకు మించి ఆయన పెత్తనం చేస్తున్నారని పార్టీ అధినేతకు పదేపదే ఫిర్యాదులు అందాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడంతో హైకమాండ్ నిర్ణయం కూడా ఉత్తరాధ్ర బాధ్యతల నుంచి తప్పించిందని సమాచారం.
Also Read: AP high Court: మరోసారి జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆన్ లైన్ టికెట్ల విషయంలో..
-స్వయంకృతమేనా?
ఇదంతా విజయసాయిరెడ్డి స్వయంకృతమే అంటున్నారు కొంతమంది నాయకులు. సాధారణంగా వైసీపీలో సర్వం జగన్నామ స్మరణే ఉండాలి. అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరగాలి. కానీ.. విజయసాయిరెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్టు కనిపిస్తూనే.. వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకుంటున్నారని విజయసాయిపై ముఖ్యమంత్రి జగన్‌కి ఉప్పందిందట. ఇదే ఆయన కొంపముంచుతోందని విజయసాయిరెడ్డి కూడా గ్రహించలేకపోయారట.
-పార్టీపై ప్రభావం పడకుండా…
విజయసాయిరెడ్డిని తప్పించిన ఎఫెక్ట్ ఎక్కడా పార్టీ పై పడకుండా మొదట్నించీ అధినేత జాగ్రత్తగానే అడుగులు వేశారని చెప్పాలి. అందులో భాగంగానే మెల్లిగా విశాఖ విషయంలోనూ నిర్ణయం తీసుకోవడాన్ని గమనించాలనంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆది నుంచి సాయిరెడ్డి విషయంలో పార్టీలోని కొందరు నేతలకు కాస్తంత జెలసీ ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. అయితే మరీ ఇంతస్థాయిలో ఆయనపై ఆలోచించే స్థాయికి రావడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో కానీ.. నిన్నటి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటనలో కానీ.. కొన్ని కీలకాంశాల విషయంలో కానీ.. విజయసాయిరెడ్డిని సంప్రదించలేదని సమాచారం. ఇన్ని జరుగుతున్నా.. సాయిరెడ్డి కూడా ఎక్కడా బయటపడలేదు.
Also Read:CM Jagan Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. ప్రణాళికలు సిద్ధం చేసిన సీఎం జగన్
Recommended Videos: