Irrigation projects : పిట్టపోరు పిట్ట పోరు పిల్లికి లోకువైనట్టుగా మారింది తెలంగాణ జలవివాదాలు. ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాలు కృష్ణా, గోదావరి నీటి కోసం గొడవ పడుతుంటే మధ్యలో దూరుతున్న కేంద్రం తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను గుప్పిన పట్టడానికి రెడీ అయ్యింది. తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టులు, నీటి వాటా కొట్టుకుంటున్న తీరుతో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ వేసింది. ఈనెల 14 నుంచి అంటే రేపటి నుంచే తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సహా అన్నింటిని కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది.

ఈ పరిణామాన్ని ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఎందుకంటే తెలంగాణ పరిధిలోనే కీలకమైన నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలున్నాయి. పైగా ఏపీకి 75శాతం నీటి వాటా కృష్ణలో ఉండగా.. తెలంగాణకు కేవలం 25శాతం వాటానే ఉంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే జారీ అయిన గెజిట్ ప్రకారం.. ఈనెల 14 నుంచి ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులు కేంద్రం ఆధీనంలోకి వెళతాయి.డెడ్ లైన్ కు ఇంకా కొద్దిగంటేల ఉండడంతో రివర్ బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలతో సమావేమయ్యాయి. కానీ అవి ఫలవంతం కాలేదు. కేంద్రం టేకోవర్ చేసే ప్రాజెక్టులపై అప్పులు ఎవరు తీరుస్తారని తెలుగు రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ను కేంద్రం పరిధిలోకి తీసుకురావడాన్ని ఏపీ ఆమోదించింది. ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తెలంగాణ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను బోర్డు తేల్చాలని.. నీటి వాటా తేలేదాకా నోటిఫికేషన్ అమలును నిలుపుదల చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు.. దీనిపై న్యాయ సలహా తీసుకొని కేంద్రంతో సుప్రీంకోర్టులో పోరేందుకు రెడీ అవుతోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా కేంద్రం చేతికి పోతే తెలంగాణకు అత్యవసరం అయిన విద్యుత్ కు ఆటంకం కలుగుతుందని.. తాము అప్పగించమని తెలంగాణ వాదిస్తోంది. మరి కేంద్రంతో నీటి వాటా కోసం ఢీ కొట్టడానికి రెడీ అయిన తెలంగాణ ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి మరీ.