Lockdown Again: ఒమిక్రాన్ వేరియంట్ దాదాపు వందకు పైగా దేశాల్లో విస్తరించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్రిటన్ లో మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అమెరికాలోనూ దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. బ్రిటన్ లో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ఇండియాలో కూడా తన ప్రభావం చూపిస్తుండటంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో ప్రజలకు పలు హెచ్చరికలు, సూచనలు చేశారు.

దీంతో మరోమారు లాడ్ డౌన్ విధించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. గతంలో విధించిన ఆంక్షలు మళ్లీ అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో రాత్రిపూట లాక్ డౌన్ విధించే ఆలోచన చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారిని నియంత్రించే క్రమంలో ప్రజలు కూడా సహకరించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నందున జాగ్తత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: ఒమిక్రాన్ ప్రభావం.. స్కూళ్ల మూసివేతకు మహారాష్ర్ట నిర్ణయం
కొవిడ్ విస్తరిస్తే తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఔషధాలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, బెడ్లు తదితర వాటిని అందుబాటులో ఉంచాల్సిన అవసరం గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో ఎక్కడెక్కడ వ్యాపిస్తోందో అనేదానిపై అధికారులతో చర్చించారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
మహారాష్ర్టలో ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువవుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో అక్కడ నియమ నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. కర్ణాటక కూడా పలు ఆంక్షలు విధిస్తోంది. దీంతో ఒమిక్రాన్ ప్రభావం పెరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చూస్తున్నారు. ప్రధాని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ ను నిరోధించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: కొత్త సంవత్సర సంబురం లేనట్టే?