PM Modi- Pathan Movie: హిందీ సినిమా చరిత్రలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాసర్ గా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం నిలిచింది. ఈ సినిమా ఇప్పటివరకు ఎనిమిది వందల కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా విజయాన్ని లోక్ సభ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గర్వంగా చెప్పుకున్నాడు.. పఠాన్ సినిమా విజయాన్ని ఉద్దేశించి పార్లమెంట్లో ప్రసంగించారు. కాశ్మీర్లో థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయని, అనేక దశాబ్దాల తర్వాత శ్రీనగర్ లో బాలీవుడ్ సినిమాలు ఆడుతున్నాయని వివరించారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాలు, నటీనటులపై అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదని పార్టీ శ్రేణులకు హితవు పలికారు. కాశ్మీర్లో ఒకప్పుడు ఉగ్రవాదులు రాజ్యమేలారని, ఇప్పుడు వారి ఆటలు సాగడం లేదని, అందుకు నిదర్శనమే షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా అని మోడీ వివరించారు. శ్రీనగర్ లోని రామ్ మున్షీ బాగ్ ఐనాక్స్ హౌస్ ఫుల్ షోలతో రన్ అవుతుందని, కాశ్మీర్లో తాము చేసిన గొప్ప పనులకు ఇది ఉదాహరణ అని మోడీ గర్వంగా ప్రకటించుకున్నారు.
వాస్తవానికి పుల్వామా దాడి తర్వాత నరేంద్ర మోడీ కాశ్మీర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అజిత్ దోవల్ నాయకత్వంలో భద్రత దళాలను మరింత పరిపుష్టం చేశారు. సరిహద్దులో చొరబాట్లను నియంత్రిస్తూనే, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఉగ్రవాదులకు నగదు సరఫరాకు కళ్లెం వేశారు. ఫలితంగా వారి ఆగడాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో మోడీ ఏం కోరుకున్నాడో అది జరగడం ప్రారంభమైంది. మరోవైపు కేంద్రం భరోసా మెండుగా ఇవ్వడంతో కార్పొరేట్ కంపెనీలు కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. ఉగ్రవాదుల దాడులతో నిత్యం భీతిల్లిన కాశ్మీరీ ప్రజలకు వినోదం కోసం సినిమా థియేటర్లను ప్రారంభించడం మొదలైంది. ఇందులో భాగంగా ఐనాక్స్ కంపెనీ రామ్ మున్షిబాగ్ లో పెద్ద థియేటర్ నిర్మించింది. ఇందులో ప్రదర్శితమయ్యే సినిమాలు చూసేందుకు జనం భారీగా వస్తున్నారు. అందుకు నిదర్శనమే పఠాన్ సినిమా విజయం. మోడీ సాధించిన ఘనవిజయం.
ఈ సినిమా ఘన విజయం సాధించడం పట్ల బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. ” సూర్యుడు ఒంటరిగా ఉన్నాడు.. అయినప్పటికీ అతడు మండుతూనే ఉంటాడు. చీకట్లను పారదోలి జగానికి మొత్తం వెలుగు పంచుతాడు..పఠాన్ సినిమా విజయం ద్వారా కొత్త వెలుగు ప్రసాదించినందుకు ధన్యవాదాలు అంటూ” ఇన్ స్టా గ్రామ్ లో షారుఖ్ రాసుకొచ్చాడు. దీనికి సూర్యుడిని ముద్దాడుతున్న ఫోటోను యాడ్ చేశాడు. ఇక ఈ సినిమాని యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించింది.. స్పై యూనివర్స్ లో నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించిన నాలుగవచిత్రం ఇది. అంతకుముందు ఆయన సల్మాన్ ఖాన్ హీరోగా ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, హృతిక్ రోషన్ హీరోగా వార్ చిత్రాలు నిర్మించారు. షారుక్ నటించిన పఠాన్ ఈ స్పై యూనివర్స్ లో నాలుగవచిత్రం. జీరో విడుదలైన నాలుగు సంవత్సరాల దాకా షారుక్ ఖాన్ సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో అతని అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. బేశరం పాట వివాదం రేకెత్తించినా ఈ సినిమా విజయాన్ని ఆపలేకపోయింది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషించారు. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించారు. త్వరలో ఈ దర్శకుడుతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంతవరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కనివిని ఎరుగని స్థాయిలో సిద్ధార్థ ఆనంద్ కు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.
“Theatres in #Srinagar are running HOUSEFULL after DECADES🔥” says PM @narendramodi while talking about BLOCKBUSTER #Pathaan
Book your tickets NOW: https://t.co/z4YLOG2NRI | https://t.co/lcsLnUSu9Y@iamsrk @yrf#ShahRukhKhan #SRK #PathaanReview #NarendraModi #NarendraModiSpeech pic.twitter.com/Q7byChYFwN
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 8, 2023