https://oktelugu.com/

కరోనా ముప్పు గురించి ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలతో పోలిస్తే దేశంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మినహా రక్షించుకోవడానికి మరో మార్గం లేదు. నిన్న బాలాసాహెబ్ వికే పాటి ఆత్మకథను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించిన ప్రధాని మోదీ ఆ సమయంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 14, 2020 / 03:17 PM IST
    Follow us on

    భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలతో పోలిస్తే దేశంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మినహా రక్షించుకోవడానికి మరో మార్గం లేదు.

    నిన్న బాలాసాహెబ్ వికే పాటి ఆత్మకథను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించిన ప్రధాని మోదీ ఆ సమయంలో కరోనా ముప్పు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా కేసులు, మరణాలు ఇంకా నమోదవుతూనే ఉన్నాయని ప్రజలు కరోనా ముప్పు తొలగిపోలేదని గుర్తుంచుకోవాలని అన్నారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతూ ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

    వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని చెప్పారు. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి కీలక విషయాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుందని తెలిపారు. మరోవైపు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

    మరోవైపు దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 15 లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 40,514 మంది వైరస్ బారిన పడి మృతి చెందగా ప్రస్తుతం 2 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ విజృంభించిన తొలినాళ్ల నుంచి మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో ఈ స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.