Homeజాతీయ వార్తలుPrime Minister Modi : మోడీ మొండితనానికి ఇది ఒక ఉదాహరణ

Prime Minister Modi : మోడీ మొండితనానికి ఇది ఒక ఉదాహరణ

Prime Minister Modi :  వక్ఫ్‌(సవరణ)బిల్లును 2024, ఆగస్టు 8న కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. దేశంలోని వక్ఫ్‌ ఆస్తిని కేంద్రం నియంత్రిస్తుంది. ముస్లింలకు చట్ట ప్రకారం పవిత్రమైన, మతపరమైన లేదా స్వచ్ఛందంగా పరిగణించబడే ప్రయోజనాలను కోసం వక్ఫ్‌ను ఏర్పాటు చేశారు. అయితే వక్ఫ్‌ ముసుగులో భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. సొంతానికి వాడుకుంటున్నారు. అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం వక్స్‌ సవరణ బిల్లును తేవాలని నిర్ణయించింది. ఆగస్టు 8న దీనిని లోక్‌సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లును ముందుగా జేపీసీకి ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. అయితే వక్ఫ్‌ చట్ట సవరణకు కట్టుబడి ఉన్న మోదీ, అమిత్‌షా.. విపక్షా కోరిక మేరకు బిల్లును జేపీసీకి కేటాయించారు. ఇందులో బీజేపీ ఎంపీ చైర్మన్‌గా, విపక్షాల ఎంపీలు సభ్యులుగా ఉన్నారు.

పంతం నెగ్గించుకున్న మోదీ..
వక్ప్‌ సవరణ బిల్లుపై అనేక అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చివరి సమావేశం సోమవారం(అక్టోబర్‌ 14న) నిర్వహించారు. ఈ బిల్లులో మెజారిటీ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఉన్నరు. దీంతో జేపీసీ సమావేశాన్ని ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు. కమిటీ నిబంధనల మేరకు పనిచేయడం లేదని ఆరోపించారు. కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ జగదంబికాపాల్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. వక్ఫ్‌ బిల్లుతో సంబంధం లేని కర్ణాటక మైనారిటీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ అన్వర్‌ మనిప్పడి తన ప్రజంటేషన్‌ ఇవ్వడానికి జేపీసీ అనుమతి ఇవ్వడాన్ని తప్పు పట్టారు.

వచ్చే సమావేశాల్లో చట్టం..
ఇదిలా ఉంటే.. మోదీ తన పంతం నెగ్గించుకోవడానికి సమయం వచ్చింది. విపక్షాల కోరిక మేరకు బిల్లును జేపీసీకి పంపించారు. అభిప్రాయాల సేకరణ తర్వాత జేపీసీ నేడో రేపో పార్లమెంటుకు నివేదిక సమర్పింస్తుంది. ఈ బిల్లును యథావిధిగా సభలో ప్రవేశపెడతారు. ఎన్డీఏకు లోక్‌సభలో, రాజ్యసభలో తగిన బలం ఉంది. దీంతో బిల్లు అమోదం పొందడం పెద్ద కష్టం కాదు. వచ్చే శీతాకాల సమావేశంలో చట్టరూపం దాల్చే అవకాశం ఉంది. ఇలా ఉంటుంది.. మోదీ అనుకుంటే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular