Oil Prices: కేంద్ర ప్రభుత్వం పెట్రోధరలు తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 లు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలకు శుభవార్త చెప్పింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాలు వ్యాట్ తగ్గించడంతో పెట్రో ధరలు దిగి వచ్చాయి. దీంతో ప్రయాణికులకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు జవాబిచ్చింది. ఇంకా ధరలు తగ్గించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెబుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ ప్రభుత్వం చెప్పిన శుభవార్తకు జనం ప్రశంసలు కురిపిస్తున్నారు.

దేశంలో ధరల తగ్గుదలతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. గత కొద్ది రోజులుగా పెట్రో ధరలతో పాటు వంట నూనెల ధరలు కూడా అంతే స్థాయిలో పెరగడం గమనార్హం. నూనెలపై కూడా రూ.7 నుంచి రూ.20 వరకు తగ్గించినట్లు తెలుస్తోంది. వేరుశనగపై రూ. 18, పామాయిల్ పై రూ.20, సోయాబీన్ పై రూ. 10, పొద్దు తిరుగుడు నూనెపై రూ.7 వరకు తగ్గించినట్లు చెప్పింది.
దీంతో ధరల తగ్గుదల క్రమంగా వస్తుండటంతో ప్రజలు సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ప్రజలకు ఊరట లభించింది. దేశంలో ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ధరల తగ్గుదలపై దృష్టి సారించడం ఆహ్వానించదగినదే. ఇంధన ధరలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న పండుగ సందర్భంగా తగ్గించడంపై ప్రజల్లో ఎంతో ఉపశమనం దొరికింది.
Also Read: Corporate tax: కార్పొరేట్ కంపెనీల లాభాలపై పడ్డ మోడీ సర్కార్?
రాబోయే రోజుల్లో కూడా కేంద్రం మరిన్ని నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ధరలను తగ్గిస్తూ ప్రజలకు సమస్యలు లేకుండా చేయాలని చూస్తోంది. ఇందుకు గాను ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: YS Jagan Praja Sankalpa Yatra: రివ్యూ: వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు