Venkaiah Naidu As Next President: అధికార పక్షం తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారనే చర్చ జోరందుకుంది. ఈ తరుణంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో జేపీ నడ్డా, అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం వెంకయ్యనాయుడుని కలిసి.. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. ఈ తరుణంలో.. రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడును నిలబెడతారా? అనే చర్చ మొదలైంది. గతంలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన వాళ్లు.. రాష్ట్రపతిగానూ పదోన్నతి పొందిన దాఖలాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులుగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి. గిరి, ఆర్. వెంకట్రామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్ నారాయణన్‌లు రాష్ట్రపతులయ్యారు. ఈ తరుణంలో.. ఇప్పుడు వెంకయ్యనాయుడుకు ఆ ఛాన్స్ దక్కవచ్చని, పైగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ల పర్వం మొదలై.. వారం గడుస్తున్నా ఇటు ఎన్డీయే, అటు విపక్షాల కూటమి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. విపక్షాలు మరోసారి భేటీ కానున్న తరుణంలో.. బీజేపీ కమిటీ మాత్రం అభ్యర్థి ఎవరనేది కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. మంగళవారం రాత్రి 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో.. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయొచ్చని భావిస్తున్నారు. ఇక విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా పేరు తెర మీదకు వచ్చింది. అయితే అందరి ఆమోదయోగ్యమైన పేరును ప్రకటిస్తామని సీపీఐ నేత డి రాజా చెప్తున్నారు. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

విపక్ష అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో విపక్ష శిబిరం అయితే గందరగోళంలో ఉంది. రకరకాల పేర్లు తెరపైకి వచ్చినా.. చివరికి మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్ హాను ప్రకటించబోతున్నాయి. ఆయన వాజ్ పేయ్ ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ చూశారు. బీజేపీతో చాలా ఏళ్ళు పనిచేశారు. అనేక మంది బీజేపీ నేతలతో ఈ రోజుకీ సన్నిహిత సంబంధాలు యశ్వంత్ కి ఉన్నాయి. ఈ నేపధ్యంలో లేట్ గా అయినా లేటెస్ట్ గానే విపక్షం ఒక గట్టి నిర్ణయమే తీసుకుంది అని అంటున్నారు. దీని వల్ల బీజేపీకి కొంత ఇరకాటం తప్పకపోవచ్చు అని కూడా ఊహిస్తున్నారు. యశ్వంత్ ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఆయనకు అధికార పార్టీలో ఉన్న పరిచయాలు ఏమైనా ఇబ్బంది పెడతాయా అన్న మాట కూడా ఉంది.
ఇక యశ్వంత్ యంటీ మోడీ ఫిలాసఫీ కూడా బహు గట్టిది. ఆ ఫిలాసఫీకి ఆకట్టుకునే వారు అధికార పార్టీలో ఉంటే కమలానికి కొంత కలవరమే అని చెప్పాలి.దీంతో విపక్ష శిబిరం క్యాండిడేట్ దాదాపుగా తెలైపోవడంతో బీజేపీ కూడా తమ కసరత్తుని ముమ్మరం చేస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ ఇప్పటిదాక కొన్ని పేర్లను ముందు పెట్టుకుందని ప్రచారం అయితే సాగింది కానీ సడెన్ గా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైపు చూస్తోంది అన్న మాట వినిపిస్తోంది. ఆయనను ముందు పెడితే అందరికీ ఆమోదయోగ్యుడిగా ఉంటారని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందరికీ ఆమోదయోగ్యుడిగా..
విపక్షం ఉమ్మడి అభ్యర్ధికి ధీటైన బదులు ఇచ్చేలా వెంకయ్యనాయుడు అభ్యర్ధిత్వం ఉంటుందని కూడా ఊహిస్తున్నారు. ఇక ఏపీకి చెందిన వెంకయ్యనాయుడు అభ్యర్ధిత్వం పట్ల తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అయితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని భావిస్తుండడం విశేషం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీకి పెద్ద దిక్కు ప్రభుత్వంలో మోడీ తరువాత అంతటి నాయకుడు అయిన అమిత్ షా బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వెంకయ్యనాయుడుని కలవడం కీలక పరిణామంగా చూడాలి.కొద్ది గంటలలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగబోతూండంగా వీరిద్దరూ వెంకయ్యనాయుడుని కలవడం ఆసక్తికరమైన పరిణామగానే చూడాలి. మరి వ్యవహారం చూస్తే అటూ ఇటూ తిరిగి బీజేపీ అభ్యర్ధి వెంకయ్యనాయుడు అవుతారా అన్న చర్చ కూడా ఉంది.
Also Read:Maharashtra Political Crisis: శివసేనలో చీలిక.. సంక్షోభంలో ‘మహా’ సర్కార్..