Modi America Visit: బలమైన నాయకుడు ఉంటే తన దేశాన్ని మరింత బలవంతంగా తీర్చి దిద్దుతాడు. ఆ బలమైన నాయకుడికి వ్యూహ చతురత కూడా తోడైతే ఇక తిరిగి ఉండదు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని దీనిని అమలులోపెట్టారు. ఫలితంగా అంతటి కాకలు తీరిన అమెరికా కూడా భారత్ ముందు తలొంచాల్సి వచ్చింది. అంతేకాదు భారత్ కోరినవన్నీ ఇవ్వాల్సి వచ్చింది.
ప్రస్తుతం భారత ప్రధాని అమెరికాలో పర్యటిస్తున్నారు. భారతదేశానికి ఏమి కావాలో చక్కబెట్టుకుని వస్తున్నారు. తనకు కావలసిన ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదు. ముక్కుసూటిగా మాట్లాడుతుండడంతో అమెరికా కూడా ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రక్షణ రంగం నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం వరకు ప్రతి విషయంలోనూ అమెరికా మీద భారత్ పై చేయి సాధించడంలో మోడీ విజయం సాధిస్తున్నారు. మోడీ పర్యటన ఎంత ఆసక్తికరంగా మారింది అంటే.. ప్రపంచ మీడియా మొత్తం కేవలం ఆయన ఏం మాట్లాడుతాడో అనే దాని మీదే ఆసక్తిగా ఎదురుచూసే దాకా వెళ్ళింది. రష్యా చేస్తున్న యుద్ధం పై తన వైఖరి ఏమిటో మోది చెప్పాడు. ఉక్రెయిన్ ఎలాంటి ధోరణి ప్రదర్శించాలో వివరించాడు. ఇటీవల కాలంలో ఒక దేశాధినేత ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ముక్కుసూటిగా మాట్లాడటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఇక ప్రపంచ పరిణామాలు అలా వదిలేస్తే భారతదేశానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో మోడీ చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నారు.. గత పాలకుల మాదిరి తలవంచి ఉండటం లేదు. అమెరికా ఏది చెప్తే దానికి తల ఊపడం లేదు. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన విషయంలో అమెరికా షరతుల కంటే తమ విధించిన డిమాండ్ల సాధనకై మోదీ పట్టు పట్టడం ఇక్కడ విశేషం.
ఇక అమెరికా పర్యటనలో రక్షణ రంగానికి సంబంధించిన కీలక ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది. సరిహద్దుల్లో చెలరేగుతున్న ఉద్రిక్తతలు, పలు విషయాల్లో చైనా పెడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అత్యంత కీలకమైన ఫైటర్ జెట్ల ఇంజన్ల తయారీలో జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) సాంకేతికత బదిలీ మొదలు.. భారీ పేలోడ్లు మోసుకుపోయే మానవ రహిత డ్రోన్ల సరఫరా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తోపాటు, ఇస్రో, నాసా ఆధ్వర్యంలో చేపట్టే ప్రాజెక్టులపై భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. డిఫెన్స్ స్టార్టప్ ల కోసం “ఇండ స్ ఎక్స్” ను లాంచనంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు అమెరికా నావికాదళ మరమ్మతులకు భారత్ సహకరిస్తుందని ప్రధాని అంగీకారం తెలిపారు. ఇక భారత్లో యూనిట్ ఏర్పాటుకు దిగ్గజ సెమీ కండక్టర్ల సంస్థ మైక్రాన్ ముందుకు వచ్చేలా నరేంద్ర మోడీ పావులు కలిపారు. హెచ్1 బీ వీసాల రెన్యువల్ ప్రక్రియ సులభతరం చేసేందుకు అమెరికాను ఒప్పించారు.
ఎఫ్ 414 ఇంజన్లు
ప్రస్తుతం భారత్ కు సరిహద్దు ప్రాంతం సున్నితమైన అంశం కావడంతో.. భవిష్యత్తులో యుద్ధాలు జరిగితే దేశం నష్టపోకూడదనే ఉద్దేశంతో రక్షణ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు అమెరికాతో మోడీ కుదుర్చుకున్నారు. యుద్ధాల్లో వాయు సేనల అమ్ములపొదిలో అత్యంత కీలకమైన ఆయుధాలు ఫైటర్ జెట్లు.. ఈ జెట్ ఇంజన్ తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాల మధ్య మాత్రమే ఉంది. ఈ పరిజ్ఞానం బదులాయింపుకు ఆ దేశాలు అసలు అంగీకరించవు. భారత్ అనేక విషయాల్లో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ జెట్ ఇంజన్ల విషయంలో మాత్రం పురోగతి లేదు. 1986 లోనే దేశీయ యుద్ధ విమానాల తయారీకి ప్రాజెక్ట్ ప్రారంభించి, వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ లక్ష్యాన్ని ఇంకా చేరలేదు. దీంతో మేకింగ్ ఇండియాలో భాగంగా రూపొందిస్తున్న తేజస్ ( మార్క్_2) యుద్ధ విమానాలకు జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ)కి చెందిన ఎఫ్ 404 ఇంజన్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 75 ఎఫ్ 404 ఇంజిన్లు భారత్ కు దిగుమతి అవ్వగా.. మరో 99 రావాల్సి ఉంది. ఎఫ్ 414 రకానికి చెందిన మరో ఎనిమిది ఇంజన్లు మాత్రం దిగుమతి అయ్యాయి. ది అమెరికా పర్యటన సందర్భంగా ఎఫ్ 414 ఇంజన్లను భారతదేశానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తో కలిసి “మేకిన్ ఇండియా”లో భాగంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది. జెట్ ఇంజన్ల తయారీ సాంకేతికత (80%) ను భారత్ కు బదలైంచేందుకు జీఈ అంగీకరించింది. అమెరికా కాంగ్రెస్ ఎందుకు ఆమోదం తెలిపితే టెక్నాలజీ బదిలీకి మార్గం సుగమం అవుతుంది.
ఎం క్యూ డ్రోన్లు
జనరల్ ఆటోమిక్స్ ఎరోనాటికల్ సిస్టమ్స్ (జీఏ _ ఏఎస్ఐ) తయారైన ఎం క్యూ_9 రకం “రీపర్” సాయుధ డ్రోన్ల సరఫరాకు కూడా భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం భారత్ ఎంక్యూ_1 ప్రిడేటర్ రకం డ్రోన్లను వాడుతోంది. ఎంక్యూ_9 యూఏవీ లు అధిక సామర్థ్యంతో పని చేసే అధునాతన డ్రోన్లు. ఎం క్యూ_1తో పోల్చితే ఐదు రెట్లు అధిక బరువు ఉన్న వార్ హెడ్స్ ను మోసుకుపోగలవు. నిరంతరం నిఘాకు, దాడులకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి. ఎం క్యూ_9 డ్రోన్ బరువు 1,746 కిలోలు కాగా.. 50 వేల అడుగుల ఎత్తులో ఎగరగలవు. 1,361 కిలోల బరువు ఉన్న పే లోడ్స్ మోసుకుపోగలవు.