Homeఆంధ్రప్రదేశ్‌PRC Issue: ఏపీ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. సీఎం జగన్ కోర్టులోకి బంతి..!

PRC Issue: ఏపీ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. సీఎం జగన్ కోర్టులోకి బంతి..!

PRC Issue: మొన్నటివరకు పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పలు చర్చల అనంతరం నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగి ఉద్యోగ సంఘాలనేతలతో చర్చలు జరిపారు. జగన్ శుభవార్త చెబుతారని అంతా భావించారు. అనుకున్నట్టు ముఖ్యమంత్రి జగన్ 26 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. దీంతో ఉద్యోగుల ఆనంధానికి అవధులు లేకుండా పోయాయి. ఏకంగా సీఎం చిత్ర పటానికి బంగారు పుష్పాలతో అభిషేకం జరిపించారు. కానీ, ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. పీఆర్సీ ప్రకటనతో ప్రభుత్వం HRA కట్ చేస్తుందని తెలియడంతో ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి అవ్వడంతో పాటు చెమటలు కక్కుతున్నారు.

AP Employees PRC Issue
AP Employees PRC Issue

పెరిగిన ఫిట్‌మెంట్ కంటే కట్ చేసే హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్ ఎక్కువగా ఉంటుందని ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించి జీవో జారీ కానుంది. వన్స్ జీరో జారీ అయితే వేతనాల్లో కోత ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పీఆర్సీ జీవో విడుదల చేయవద్దని కోరుతున్నారు. హెచ్‌ఆర్‌ఏ సంగతి తేల్చాకే జీవో పై ముందకెళ్లానని సూచిస్తున్నారు.

Also Read: ఏపీలో ఎటూ తేలని PRC పంచాయితీ.. సీఎంవో చుట్టూ ఉద్యోగ సంఘాల ప్రదక్షిణలు

ఒకవేళ జీవో జారీ అయితే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఫిట్ మెంట్ విషయంలో తగ్గినా హెచ్ఆర్ఏ విషయంలో తగ్గేదే లేదంటున్నారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ HRA తగ్గించాలని సిఫార్సు చేయడంతో వాటిని అమలు చేస్తామని ప్రభుత్వం అంటుండగా, ఇప్పడు ఉన్న వాటినే కొనసాగించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. దీంతో వీరంతా సీఎంవో కార్యాలయం చుట్టూ రెండ్రోజులుగా తిరుగుతున్నారు.

ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం జీవో ఇస్తే సచివాలయ HOD ఉద్యోగులకు 22 శాతం, జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు 12 శాతం, మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు 6.5శాతం, మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 4.5 శాతం హెచ్‌ఆర్‌ఏను కోల్పోనున్నారు. అదే జరిగితే ఉద్యోగులు తమ ఆగ్రహాన్ని ఉద్యోగ సంఘాల నేతలపై చూపించనున్నారు. మొత్తానికి పీఆర్సీ ప్రకటన, హెచ్ఆర్ఏలో కోత విషయంపై ఉద్యోగులు ప్రభుత్వం చెప్పిన మాట వినేలా బంతిని తన కోర్టులోకి తెచ్చుకోవడంలో జగన్ సర్కార్ విజయవంతమైందని చెప్పుకోవచ్చు.

Also Read: ఏబీఎన్ ఆర్కే, వర్మ.. ఇద్దరికీ తిక్కుంది.. వారి ఇంటర్వ్యూకు ఓ లెక్కుంది

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular