PRC Fight: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పీఆర్సీ ప్రకటన చేయాలని కోరాని ఫలితం కానరావడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాలు మరోమారు సమ్మె చేయడానికి సంకల్పించాయి. తమ డిమాండ్ల సాధనకు పోరాడాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే మంగళవారం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయాలని భావించాయి. కానీ ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం మాత్రం తాము సమ్మెలో పాల్గొనబోమని ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగ సంఘాలు రెండు వర్గాలుగా వీడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

సీఎం జగన్ ఇప్పటికే పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. దానికి కార్యరూపం కనిపించడం లేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన కలుగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా పనిచేయడం లేదు. అందుకే ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని ప్రకటిస్తున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కానరావడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.
అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే సత్తా తమకు ఉందని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అయితే రాజకీయ పార్టీ పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతల తీరుపై సజ్జల విమర్శలు చేశారు. పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తామనడం సరికాదని చెబుతున్నారు. దీనిపై పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు
Also Read: BJP: మిషన్-2023.. బీజేపీలోకి ఉద్యమ నేతలు.. చేరికలతో బీజీబీజీ..!
ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళన చేయాలని చెబుతున్నా మరో వర్గం మాత్రం స్పందించడం లేదు. ట్రెజరీ ఉద్యోగులు తాము ఆందోళనలో పాల్గొనమని చెప్పడంతో ఉద్యోగ సంఘాల్లోనే రెండు వర్గాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల డిమాండ్లు నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: Jagan vs Raghurama: అనవసరంగా పెట్టుకొని జగన్ అభాసుపాలయ్యారా?