https://oktelugu.com/

CM Kcr- Prashant Kishor: ‘పీకే’ అడుగులు.. కేసీఆర్ గుట్టు కాంగ్రెస్ చేతికి?

CM Kcr- Prashant Kishor: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పక్షం రోజుల క్రితం వరకు ఏ పార్టీకీ సంబంధం లేని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ ఒక్కసారిగా కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపడంతో గులాబీ పార్టీ గూటిలో గుబులు మొదలైంది. నెల క్రితమే పీకే టీఆర్‌ఎస్‌ తరఫున రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పీకే సర్వే నిర్వహించారు. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్యేల బలాబలాలు.. బలహీనతలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి, గులాబీ బాస్‌ కె.చంద్రశేఖర్‌రావుకు నివేదిక ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. పీకే […]

Written By:
  • NARESH
  • , Updated On : April 19, 2022 / 04:32 PM IST
    Follow us on

    CM Kcr- Prashant Kishor: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పక్షం రోజుల క్రితం వరకు ఏ పార్టీకీ సంబంధం లేని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ ఒక్కసారిగా కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపడంతో గులాబీ పార్టీ గూటిలో గుబులు మొదలైంది. నెల క్రితమే పీకే టీఆర్‌ఎస్‌ తరఫున రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పీకే సర్వే నిర్వహించారు. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్యేల బలాబలాలు.. బలహీనతలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి, గులాబీ బాస్‌ కె.చంద్రశేఖర్‌రావుకు నివేదిక ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. పీకే ఒక్కసారిగా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో.. ఇప్పుడు ఆయన చేతిలోని టీఆర్ఎస్ పార్టీ రహస్యాలు, వ్యూహాలు, ఎమ్మెల్యేల బలాలు, బలహీనతలు వచ్చే ఎన్నికల్లో ఇవి కాంగ్రెస్‌కు బలంగా మారుతాయన్న ఆందోళన నెలకొంది.

    CM Kcr- Prashant Kishor

    -స్నేహితుడా.. శత్రువా?
    రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచిస్తూ ఎన్నికల్లో విజయానికి సహకరిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్‌ కిశోర్‌. 2014లో బీజేపీకి, 2018లో వైఎస్సార్‌సీపీకి, 2020లో బీహార్‌లో నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జనతాదల్‌ (యూ) కు, 2021లో బెంగాల్‌లో తృణమోల్‌ కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా వ్యవహరించి వారి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం, పీకేను మించిన రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు ఉన్న సీఎం కేసీఆర్‌ వ్యూహాలు ఇటీవల బెడిసి కొడుతుండడంతో విధిలేని పరిస్థితిల్లో గులాబీ బాస్‌ కూడా తిరిగి పీకేను ఆశ్రయించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తెలంగాణలో పీకే రంగంలోకి దిగారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పనితీరుపై సర్వే చేశారు. తర్వాత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పనితీరు, అనుకూలతలు, వ్యతిరేకతలపైనా ప్రజాభిప్రాయం సేకరించారు. అయితే నాలుగు నెలలుగా పీకే సహాయంపై నోరు విప్పని కేసీఆర్‌.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్‌ ప్రజాధనం రూ.300 కోట్లకుపైగా ప్రశాంత్‌ కిశోర్‌కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో అలెర్ట్ అయ్యారు. పీకే తనకు మంచి మిత్రుడని, ఆయన టీఆర్‌ఎస్‌ కోసం రాష్ట్రంలో పనిచేస్తున్నాడని ప్రకటించారు. పీకే పైసల కోసం పనిచేయడని, పనికిరాని ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు కూడా ఫ్రీగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నెల తిరిగేలోపు పీకే తీసుకున్న నిర్ణయంతో కేసీఆర్‌ దిమ్మతిరిగిపోయింది. దీంతో కేసీఆర్‌ చెప్పినట్లు పీకే ఆయనకు స్నేహితుడా? రాజకీయ శత్రువా అన్న చర్చ జరుగుతోంది.

    Also Read: Byreddy Siddharth Reddy: వైసీపీకి బైరెడ్డి బైబై.. టీడీపీ గూటికి ఫైర్ బ్రాండ్ సిద్ధార్థ్ రెడ్డి

    -మొదటి నుంచి పీకే కాంగ్రెస్‌కు అనుకూలం..
    ప్రశాంత్‌ కిశోర్‌ 2014లో మినహా ఎప్పుడూ బీజేపీకి పని చేయలేదు. 2014లో కూడా దేశవ్యాప్తంగా సర్వే మాత్రమే నిర్వహించారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని మోదీ మేనియాతో 2014లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ గెలుచుకుంది. ప్రశాంత్‌ కిశోర్‌ మాత్రం 2014 తర్వాత నుంచి బీజేపీ వ్యతిరేక పార్టీలకే వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ విజయం కోసం పనిచేయాలని కోరినా.. ఆ సమయంలో కాంగ్రెస్‌తో ఏర్పడిన విభేదాలతో దూరంగా ఉన్నారు. కాగా, తాజాగా పీకే మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారు. ఇటీవల వరుసగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. 2024లో పార్టీ విజయానికి పనిచేయడంతోపాటు 2023లో జరిగే కర్నాటక, గుజరాత్‌ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపునకు పనిచేసేలా ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో పీకేను సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

    CM Kcr- Prashant Kishor

    -పుణ్యం.. పురుశార్థం దక్కేలా..
    2014 తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన పీకే తెర వెనుక రాజకీయాలు కాకుండా.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని భావిస్తున్నారు. ఇందుకు అనుకూలమైన పార్టీల కోసం అన్వేషించారు. అయితే 2020లో జనతాదల్‌(యూ)లో చేరారు. అయితే ఆ పార్టీలో ఉంటే జాతీయ రాజకీయాల్లో రాణించ లేమని, మరోవైపు ఆ పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉందని ఆరు నెలలు తిరగకుండానే రాజీనామా చేశారు. ఈ క్రమంలో జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో చేరితేనే గుర్తింపు ఉంటుందని భావించి తాజాగా ఆ పార్టీకి దగ్గరవుతున్నారు. కాంగ్రెస్‌లో చేరి.. 2024 ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించడం ద్వారా తనకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

    Also Read:CM KCR- National Politics: కల చెదిరే.. ఒంటరిగా మిగిలిపోయిన కేసీఆర్!?

    Recommended Videos:

     

    Tags