CM Jagan: జగన్ ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేస్తున్నారా? ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారా? వారి మధ్య విభేదాలు నెలకొన్నాయ? అసలేం జరిగింది? ఇటీవల జగన్ను ప్రశాంత్ కిషోర్ ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల కాలంలో ఏపీతోపాటు బయట నుంచి తనకు తిట్లు వస్తున్నాయని ప్రశాంత్ కిషోర్ వాపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్దిరోజుల కిందట జగన్ పాలనను తప్పుపడుతూ పీకే వ్యాఖ్యలు చేయడం, తాజాగా తిట్ల బాధితుడు కావడంతో.. ఇది ముమ్మాటికి వైసిపి పనేనని చర్చ నడుస్తోంది.
2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఇదిగో ఈయన పేరు ప్రశాంత్ కిషోర్.. వచ్చే ఎన్నికల్లో మనల్ని గెలిపిస్తున్నారంటూ అప్పట్లో జగన్ పార్టీ క్యాడర్ కు పరిచయం చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ కు సరైన గౌరవం, సముచిత స్థానం కల్పిస్తూ వచ్చారు. కానీ ఆయన అనూహ్యంగా రాజకీయాల బాట పట్టారు. సొంత రాష్ట్రం బీహార్లో పార్టీ పెట్టుకుని.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. దీనికి జగనే ఆర్థిక సహాయం అందించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించారు. జగన్ను డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.
కొద్దిరోజుల కిందట ఓ ప్రత్యేక డిబేట్లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ప్రభుత్వాల పనికిమాలిన విధానాలు, రాష్ట్రాలను దివాలా తీసే పథకాల గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను ఉదహరించారు. పంచిపెట్టుకుంటూ పోతే ఏపీలో అయిపోతుందని వ్యాఖ్యానించారు. జగన్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపేలా పీకే కామెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం పీకే టీం జగన్ కు పనిచేస్తున్నా ప్రశాంత్ కిషోర్ ఇతర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ విషయంలో ప్రశాంత్ కిషోర్ ఎందుకు అభిప్రాయం మార్చుకున్నారు అన్న చర్చ ప్రారంభమైంది.
ప్రశాంత్ కిషోర్ ఐపాడ్ పనితీరు విషయంలో జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే పీకే జగన్ కు హెచ్చరిక సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐప్యాక్ ఒక్క ఏపీలోని వైసీపీకి మాత్రమే పని చేస్తుంది. మొన్నటి వరకు తెలంగాణలో కెసిఆర్ పార్టీకి సేవలందించినా.. ఎందుకో వారి సేవలను కెసిఆర్ నిలిపివేశారు. కేవలం సోషల్ మీడియా స్ట్రాటజీలకు మాత్రమే ఐ ప్యాక్ అక్కడ పరిమితమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సునీల్ కొనుగోలు హవా నడుస్తుంది. పీకే టీంకు కాలం చెల్లినట్లు సంకేతాలు వస్తున్నాయి. ఫలితాలు కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అందుకే జగన్ సైతం పీకే టీంకు పక్కన పడేసినట్లు తెలుస్తోంది. అందుకే ప్రశాంత్ కిషోర్తన వ్యూహాన్ని జగన్ పై అమలు చేస్తున్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.