Prashanth Kishore KCR: తెలంగాణలో పీకే సర్వే: టీఆర్ఎస్ గెలుస్తుందా? కేసీఆర్ తో రహస్య చర్చలు? కథేంటి?

Prashanth Kishore KCR: తెలంగాణలో రెండు సార్లు అధికారం కొల్లగొట్టిన కేసీఆర్ కు మూడోసారి అధికారం అంత ఈజీ కాదన్న విషయం తెలుసు. అందుకే తను రాజకీయ చాణక్యుడు అయినా సరే.. మూడో సారి గెలుపు కోసం దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తున్నారు. వచ్చేసారి తెలంగాణలోనే కాదు.. దేశ రాజకీయాలను ఏలుదామని రెడీ అవుతున్న కేసీఆర్ తో పీకే కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ టీం […]

Written By: NARESH, Updated On : February 28, 2022 9:19 am
Follow us on

Prashanth Kishore KCR: తెలంగాణలో రెండు సార్లు అధికారం కొల్లగొట్టిన కేసీఆర్ కు మూడోసారి అధికారం అంత ఈజీ కాదన్న విషయం తెలుసు. అందుకే తను రాజకీయ చాణక్యుడు అయినా సరే.. మూడో సారి గెలుపు కోసం దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తున్నారు. వచ్చేసారి తెలంగాణలోనే కాదు.. దేశ రాజకీయాలను ఏలుదామని రెడీ అవుతున్న కేసీఆర్ తో పీకే కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ టీం తాజాగా తెలంగాణలోని పరిస్థితులపై సర్వే చేసినట్టు తెలిసింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయని.. వాటిని చర్చించేందుకే సీఎం కేసీఆర్, కేటీఆర్ లతో పీకే ఫాంహౌస్ లో రహస్య చర్చలు సాగించినట్టు సమాచారం. దాదాపు రెండు రోజుల పాటు రహస్య చర్చలు సాగించినట్టు ప్రచారం సాగుతోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ లు ఆదివారం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. వీరి భేటిని టీఆర్ఎస్ వర్గాలు అత్యంత రహస్యంగా ఉంచినట్టు తెలిసింది.

దేశవ్యాప్తంగా సర్వేలు చేస్తూ అభిప్రాయాలను సేకరిస్తున్న పీకే బృందం తెలంగాణలోనూ సర్వే నిర్వహించినట్టు తెలిసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో పీకేతో ఫాంహౌస్ లో భేటి కావడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు కేసీఆర్ ప్రకాష్ రాజ్ తో సమావేశమై పీకే తో కలిసి తెలంగాణ ప్రాజెక్టులను సందర్శింపచేశారు.

కేసీఆర్ , ప్రశాంత్ కిషోర్ లు బీజేపీ, కాంగ్రెస్ యేతర జాతీయ రాజకీయ వేదికతోపాటు ఇటీవల ముంబై పర్యటనలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కేసీఆర్ ఈ చర్చలు జరిపినట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై తమ టీం సర్వేను కూడా పీకే అందించినట్టు సమాచారం.

ఇక తెలంగాణలో వచ్చేసారి టీఆర్ఎస్ గెలుపుపై కూడా పీకే సర్వే చేశారని.. దీనిపై కీలక సమాలోచనలు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో మరోసారి గెలవడానికి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తగిన సూచనలు సీఎం కోరినట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ ఇప్పటి నుంచే మరోసారి పార్టీ గెలుపు కోసం బాటలు వేసే పనిలో ఈ వ్యూహాలు రూపొందినట్టు తెలిసింది.