Prakash Raj Question Govt: ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో జగన్ ప్రభుత్వం తీరు సరిగ్గా లేదు అని పవన్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారు. పవన్ కల్యాణ్ పై జగన్ ప్రభుత్వం పగ పట్టి.. కావాలనే, సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ జీవో విడుదల చేయడం లేదు అని పవన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.
కానీ, సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం ఇది తప్పు అని ఒక్క హీరో కూడా నోరు ఎత్తలేకపోయాడు. పవన్ పై పగతోనే సినిమా టికెట్ ధరలపై జీవో విడుదల చేయకుండా ఉన్నా.. ఏ స్టార్ హీరో నోరు మెదపడం లేదు. అగ్ర హీరోలే ఇలా ఉంటే..ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి ? చిన్న హీరోల పరిస్థితి ఏమిటి ? వకీల్ సాబ్ సినిమా నుంచి భీమ్లానాయక్ వరకు ఆంక్షలు విధిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాలను ఇబ్బందులకు గురి చేస్తున్నా.. ఎవరూ పవన్ కి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు.
ఏది ఏమైనా ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు పవన్ కు కనీస మద్దతు కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం. అయితే, పెద్ద పెద్ద హీరోలు సైలెంట్ గా వేడుక చూస్తుంటే.. నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు ప్రకాష్ రాజ్. ‘తెలుగు చిత్ర పరిశ్రమను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ.. మరోపక్క మేము ప్రోత్సహిస్తున్నామంటే ఎలా నమ్మాలి ?” అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
Also Read: కరోనా బారిన పడిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ !
పైగా ప్రకాష్ రాజ్ సీరియస్ అవుతూ జగన్ ప్రభుత్వానికి సలహా ఇస్తూ.. ‘దయచేసి మీ వ్యక్త కక్ష్య సాధింపు చర్యలు ఇంతటితో ముగింపు పలకండి. “సృజన… సాంకేతికత మేళవించిన సినిమా రంగం పై అధికార దుర్వినియోగం చేయడం ఎవ్వరికీ మంచిది కాదు. అయినా సినిమా రంగం పై మీ ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభ పెడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము అంటూ ప్రకాష్ రాజ్ తన వాయిస్ వినిపించాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ‘భీమ్లానాయక్ సినిమా పై ఏపీ ప్రభుత్వం తమ ప్రతాపం చూపిస్తోంది. ముఖ్యంగా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోని విడుదల చేయకుండా పవన్ సినిమాని ఇబ్బంది పాలు చేస్తోంది. పైగా పవన్ సినిమా ప్లాప్ అంటూ నెగిటివ్ ప్రచారాన్ని కూడా వైరల్ చేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ పవన్ కి సపోర్ట్ గా మాట్లాడటం అభినందనీయం.
Also Read: అవి నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి – సమంత