NTPC Jobs: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు వరుసగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నాయి. ఇటీవలే రైలే‍్వ శాఖ గ్రూప్-డీ ఉద్యోగాలు, పోస్టల్ శాఖ డాక్ సేవక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాయి. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఎన్టీపీసీ కూడా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) పోస్టులు భర్తీ చేయనున్నట్లు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పేర్కొంది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. 2025, ఫిబ్రవరి 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 1 వరకు అవకాశం ఉంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలు, జీతం వివరాలు నోటిఫకేషన్ త్వరలో ఎన్టీపీసీ అధికారక వెబ్‌సైట్‌లో అందుబాటులో పెడతామని అధికారులు పేర్కొన్నారు. గరిష్ట వేతనం రూ.55 వేలు ఉంటుందని తెలిపారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేస్తారు.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ వివరాలు..
– సంస్థ : ఎన్టీపీసీ
– మొత్తం ఖాళీలు : 400
– పోస్టు పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్)
– ఉద్యోగ ప్రదేశం : భారత దేశం అంతటా
– అప్లికేషన్ మోడ్ : ఆన్‌లైన్
– దరఖాస్తు ప్రారంభ తేదీ : 2025, ఫిబ్రవరి 15
– దరఖాస్తు చివరి తేదీ : 2025, మార్చి 1
– అధికారిక వెబ్ సైట్ – ntpc.co.in
విద్యా అర్హత..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు బీఈ లేదా బీటెక్ పూర్తిచేసి ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా సంబంధిత రంగాలలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా పవర్ప్లాంట్ ఆపరేషన్స్ లేదా ఇలాంటి రంగంలో ముందస్తు అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు ఉండాలి. నిబంధనల మేరకు ఎసీ‍్స, ఎస్టీ, ఓబీసీ, ఇతర రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్:
ఇంటరూ‍్య్వ తర్వాత షార్ట్‌లిస్‌్ట చేసిన అభ్యర్థుల విద్య, ఎక్‌్సపీరియన్స్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
అర్హత ఉన్నవారు ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవాలి. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు అన్ని సర్టిఫికెట్ల సిద్ధంగా ఉన్నాయో నిర్దారించుకోవాలి.
– అధికారిక ఎన్టీపీసీ వెబ్‌సైట్‌ను ntpc.co.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
– కెరీర్స్ విభాగానికి వెళ్లండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) రిక్రూట్ మెంట్ 2025 ప్రకటనను కనుగొనడానికి ‘నోటీస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
– దరఖాస్తు ఫారమ్‌ను నమోదు చేసి పూరించండి.
– అవసరమైన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాలి.
– దరఖాస్తు రుసుము చెల్లించాలి.
– దరఖాస్తును సమర్పించి.. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.