https://oktelugu.com/

Janasena Avirbhava Sabha : జనసేన ఆవిర్భావ వేదికకు ఎవరి పేరు పెట్టారో తెలుసా?

Janasena Avirbhava Sabha : అధికార వైసీపీని ఓడించడమే ధ్యేయంగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళుతున్నాడు. ఏపీ ప్రతిపక్షాలను ఒక గాటిన కట్టడం నుంచి మొదలు ప్రతీ నిర్ణయం వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఎవరినైతే తనపై ఉసిగొలుపుతున్నాడే వారినే టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మొన్నటికి మొన్న తనపై జగన్ ఉసిగొలిపే మంత్రి అంబటిరాంబాబు నియోజకవర్గం సత్తెనపల్లిలో సభ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2023 / 03:57 PM IST
    Follow us on

    Janasena Avirbhava Sabha : అధికార వైసీపీని ఓడించడమే ధ్యేయంగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళుతున్నాడు. ఏపీ ప్రతిపక్షాలను ఒక గాటిన కట్టడం నుంచి మొదలు ప్రతీ నిర్ణయం వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఎవరినైతే తనపై ఉసిగొలుపుతున్నాడే వారినే టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.

    మొన్నటికి మొన్న తనపై జగన్ ఉసిగొలిపే మంత్రి అంబటిరాంబాబు నియోజకవర్గం సత్తెనపల్లిలో సభ పెట్టి ఆయన పరువు తీసిన పవన్ ఇప్పుడు.. ఒంటికాలిపై లేచే కాపు నేత, మాజీ మంత్రి పేర్ని నాని పని పట్టేందుకు రెడీ అయ్యారు. పేర్ని నాని సొంత నియోజకవర్గం మచిలీపట్నంలో మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించేందుకు రెడీ అయ్యారు.

    జగన్ అండతో చెలరేగిపోతున్న పేర్ని నాని కుంభస్థలాన్ని కొట్టేందుకు పవన్ రెడీ అయ్యారు. జనసేన సభ నిర్వహించి పేర్ని నానిని వచ్చే ఎన్నికల్లో ఓడించే ప్లాన్ చేశారు. ఇక్కడ అత్యధికంగా ఉన్న కాపులను ఒక్కటి చేయాలని.. బలమైన నేత వంగవీటి రాధాను చేర్చుకొని అభ్యర్థిగా ప్రకటించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇటు నానిని ఓడించడం.. వంగవీటిని ఆకర్షించడమే ధ్యేయంగా పవన్ సభ పెడుతున్నారు.

    దాదాపు 34 ఎకరాల్లో ప్రత్యేకంగా జనసేన ఆవిర్భావ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మచిలీపట్నం ప్రజలు ముందుకు వచ్చి ఇక్కడ సభ కోసం సహకరిస్తున్నారని నాదెండ్ల తెలిపారు. భద్రతపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నాదెండ్ల ప్రకటించారు.

    ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మూలపురుషుడు.. ఆంధ్రుల ఆరాధ్యదైవం అయిన ‘పొట్టి శ్రీరాములు’ పేరును ఈ ఆవిర్భావ సభకు నామకరణం చేస్తున్నట్టు నాదెండ్ల తెలిపారు. ఇలా ఒకే దెబ్బకు చాలా పిట్టలు రాలిపోయేలా.. ముఖ్యంగా ఊ అంటే చాలు పవన్ పై ఎగిసిపడుతున్న పేర్ని నాని పునాదులు కదిలేలా మార్చి 14న మచిలీపట్నంలో ‘జనసేన ఆవిర్భావ సభను’ ఏర్పాటకు నిర్ణయించారు. ఈ సభ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందన్నది వేచిచూడాలి.