Postpone JNTU Exams: క రోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో విద్యాసంస్థలన్నీ కూడా రీ ఓపెనింగ్ పైన వెనుకడుగు వేస్తున్నాయి. ఆన్ లైన్ లోనే మరి కొన్ని రోజుల పాటు తరగతులు నిర్వహించాలని నిర్ణయించేసుకుంటున్నాయి. అలా విద్యాసంస్థలన్నీ మళ్లీ ఆన్ లైన్ బాట పడుతున్నాయి. తెలంగాణలోని పలు యూనివర్సిటీలు ఈ మేరకు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాయి.
కరోనా వలన గతేడాది విద్యా సంస్థలు చాలా కాలం మూతబడే ఉన్నాయి. కాగా, ఈ ఏడాది కూడా మళ్లీ కొవిడ్ ప్రభావం విద్యా సంస్థలపైన పడుతోంది. తాజాగా హైదరాబాద్ జేఎన్ టీయూ ఓ డెసిషన్ తీసుకుంది. ఈ నెల 17 నుంచి 22 వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలో 17న ఓపెన్ కావల్సి ఉంది. కానీ,కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీ పరిధిలోని బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, కోర్సులు చదువులున్న విద్యార్థులందరికీ ఆన్ లైన్ క్లాసెస్ కండక్ట్ చేయనున్నారు. ఇకపోతే ఈ నెల 17 నుంచి నిర్వహించాల్సిన ఎగ్జామ్స్‌ను పోస్ట్ పోన్ చేశారు.
Also Read: నాజూగ్గా కనిపించే సమంత అంత బరువును ఎలా మోసింది ?
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్వహించాల్సిన పరీక్షలన్నిటినీ వాయిదా వేసినట్లు తెలిపారు. వాయిదా పడిన ఎగ్జామ్స్ కు సంబంధించి నూతన షెడ్యూల్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉండగా, అవి వాయిదా పడ్డాయి.
తెలంగాణలో విద్యాసంస్థలన్నీ కూడా రేపట నుంచి తిరిగి రీ ఓపెన్ కావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ఇంకొంత కాలం అనగా ఈ నెల 31 వరకు పొడిగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అయితే, అమలులో ఉన్నాయి. ఈ నెల 20 వరకు ఆంక్షలు ఉంటాయని తెలంగాణ సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కనీసంగా ఆ తేదీ వరకు అనగా ఈ నెల 20 వరకు స్కూల్స్, కాలేజెస బంద్ చేసే అవకాశముందని సమాచారం.
Also Read: బ్రహ్మ ముహూర్తం సమయంలో ఇలా చేస్తే మీ కోరికలు తీరడం ఖాయం!