https://oktelugu.com/

Samantha: నాజూగ్గా కనిపించే సమంత అంత బరువును ఎలా మోసింది ?

Samantha: సమంత బాడీ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. అందంలోనూ అమ్మడు బరువులు మోయడంలో బాగా అరితేరిపోయింది. అయినా ఎన్ని బరువులు ఎత్తకపోతే సామ్ ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. తాజాగా 80 కిలోల బరువు ఎత్తి.. మొత్తానికి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు చూడటానికి సన్నగా.. నాజూగ్గా కనిపించే సమంత 80కిలోల బరువును ఎలా ఎత్తింది ? పైగా అలవోకగా ఎత్తింది. అన్నట్టు ఇందుకు సంబంధించిన వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన జిమ్‌ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 16, 2022 / 11:03 AM IST

    Samantha

    Follow us on

    Samantha: సమంత బాడీ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. అందంలోనూ అమ్మడు బరువులు మోయడంలో బాగా అరితేరిపోయింది. అయినా ఎన్ని బరువులు ఎత్తకపోతే సామ్ ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. తాజాగా 80 కిలోల బరువు ఎత్తి.. మొత్తానికి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు చూడటానికి సన్నగా.. నాజూగ్గా కనిపించే సమంత 80కిలోల బరువును ఎలా ఎత్తింది ? పైగా అలవోకగా ఎత్తింది. అన్నట్టు ఇందుకు సంబంధించిన వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

    Samantha

    తన జిమ్‌ వర్కవుట్‌లో భాగంగా ఆమె వరుసగా 75కిలోలు, 78కిలోలు, 80కిలోల బరువును ఎత్తింది. ‘లెవల్ అప్’ ఛాలెంజ్ పేరుతో సామ్ ఈ వీడియోలను తన అభిమానులతో పంచుకుంది. వీడియోలతో పాటు ఒక మెసేజ్ కూడా షేర్ చేసింది పాప. ‘నా ట్రైనర్ జునైద్ షేక్ తనకు ఛాలెంజ్ చేశాడు. నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా’ అంటూ అమ్మడు ఛాలెంజ్ విసిరింది. ఇక హీరోయిన్ గా సమంత ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడాకుల వ్యవహారం, అలాగే సామ్ ఎఫైర్లు అంటూ వచ్చిన లేనిపోని పుకార్లు, ఇక ఆ పుకార్ల ప్రభావం నుంచి సమంత ఇప్పుడిప్పుడే బయట పడుతుంది.

    Also Read: బ్రహ్మ ముహూర్తం సమయంలో ఇలా చేస్తే మీ కోరికలు తీరడం ఖాయం!

    ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్టే. ఏది ఏమైనా తన జీవితంలో వచ్చిన అనేక ఇబ్బందులకు సంబంధించి ఆమె రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది. ‘మీతో మీరు మీలో మీరు నిజాయితీగా ఉండండి’ అంటూ ఓ భావోద్వేగమైన మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంత ఈ సందేశాన్ని ఎందుకు పోస్ట్ చేసిందా అని ఆరా చైతుని ఉద్దేశించే పోస్ట్ చేసిందని తెలుస్తోంది.

    ఏది ఏమైనా 2021 సంవత్సరం సమంతకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం. అందుకే, పాత జ్ఞాపకాలన్నిటినీ మరచిపోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో బాధలన్నిటినీ మర్చిపోయింది. మరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే, గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేయాలి కదా. కాబట్టి వదిలేసింది. ఊరికినే వదిలేస్తే ఏం బాగుంటుంది. అందుకే, తన ఇన్ స్టా అకౌంట్ లో తన బలం ఏమిటో చూపిస్తూ వీడియోలను షేర్ చేసింది.

    Also Read: కులాంత‌ర వివాహాలు చేసుకున్న మ‌న టాలీవుడ్ హీరోలు వీరే..

    Tags