https://oktelugu.com/

బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో మిగతా వాళ్లతో పోలిస్తే బాలకృష్ణ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ఏ విషయం గురించైనా బాలకృష్ణ ముక్కుసూటిగా మాట్లాడతారు. కాస్త భోళాతనం ఉన్న బాలయ్య పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల గురించి నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం తెలంగాణ సర్కార్ తో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు చర్చలు జరపడంపై బాలయ్య సీరియస్ అయ్యారు. Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు […]

Written By: , Updated On : September 8, 2020 / 08:20 PM IST
Follow us on

posani reacts on balakrishna real estate

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో మిగతా వాళ్లతో పోలిస్తే బాలకృష్ణ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ఏ విషయం గురించైనా బాలకృష్ణ ముక్కుసూటిగా మాట్లాడతారు. కాస్త భోళాతనం ఉన్న బాలయ్య పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల గురించి నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం తెలంగాణ సర్కార్ తో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు చర్చలు జరపడంపై బాలయ్య సీరియస్ అయ్యారు.

Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

తనను పిలవకపోవడం గురించి స్పందిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, భూములను పంచుకోవడం కోసం వాళ్లు తెలంగాణ సర్కార్ ను కలుస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై టాలీవుడ్ స్టార్ హీరోలు సైలెంట్ కావడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా సినీ నటుడు, రచయిత, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళి ఈ వివాదం గురించి స్పందించి బాలకృష్ణను కెలికారు.

తనదైన శైలిలో బాలకృష్ణ వ్యాఖ్యలపై పోసాని విమర్శలు చేశారు. నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే భూములతో అవసరం ఉందదని పేర్కొన్నారు. తన లాంటి వ్యక్తి బాలయ్య వ్యాఖ్యల గురించి స్పందించకపోవడమే మంచిదని తాను ఏ విధంగా మాట్లాడతానో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. డబ్బు, పేరు ఉన్నవాళ్లే తెలంగాణ సర్కార్ ను కలిశారని… తెలంగాణ సర్కార్ కాళ్లు పట్టుకునే స్థితిలో చిరంజీవి, నాగార్జున లేరని అన్నారు. రాజకీయాల్లో ఇప్పుడు సినిమా వాళ్లకు స్కోప్ లేదని… సీఎం జగన్ తనకు పదవులు ఆఫర్ చేసినా తిరస్కరించానని పోసాని అన్నారు.

Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!