Popular News Channel- ED: ఈడీ భయంతోనే ఆ చానెల్ ప్లేట్ ఫిరాయించిందా?

Popular News Channel- ED: దేశ వ్యాప్తంగా ఈడీ కేసులు పెరుగుతున్నాయి. గిట్టని వాళ్లపై కేంద్ర ప్రభుత్వం ఈడీని ఎగదోస్తుందన్న టాక్ అయితే నడుస్తోంది. ఈడీ..మోడీ అని విపక్షాలు సైతం ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా ఈడీ వాలిపోతుండడంతో నేతలు భయపడిపోతున్నారు. చివరకు తమకు కొరకరాని కొయ్యగా మిగిలిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కూడా ఈడీని ప్రదర్శించారన్న టాక్ నడుస్తోంది. ఆమె కేబినెట్లోని మంత్రులను ఈడీ అరెస్ట్ చేసినా ఆమె మౌనం […]

Written By: Dharma, Updated On : August 5, 2022 11:42 am
Follow us on

Popular News Channel- ED: దేశ వ్యాప్తంగా ఈడీ కేసులు పెరుగుతున్నాయి. గిట్టని వాళ్లపై కేంద్ర ప్రభుత్వం ఈడీని ఎగదోస్తుందన్న టాక్ అయితే నడుస్తోంది. ఈడీ..మోడీ అని విపక్షాలు సైతం ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా ఈడీ వాలిపోతుండడంతో నేతలు భయపడిపోతున్నారు. చివరకు తమకు కొరకరాని కొయ్యగా మిగిలిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కూడా ఈడీని ప్రదర్శించారన్న టాక్ నడుస్తోంది. ఆమె కేబినెట్లోని మంత్రులను ఈడీ అరెస్ట్ చేసినా ఆమె మౌనం దాల్చిందంటే ఏ స్థాయిలో పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకూ పారిశ్రామిక వేత్తలు, నాయకులపై దృష్టిసారించిన ఈడీ ఇప్పుడు అనూహ్యంగా మీడియాపై కూడా పడినట్టు టాక్ నడుస్తోంది. తెలుగ రాష్ట్రాల్లో ఒక చానల్ రాత్రికి రాత్రే స్వరం మార్చడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏ నేతనైతే మొన్నటి వరకూ పల్లకి మోసారో.. అదే నేతను టార్గెట్ చేస్తూ కథనాలు, చర్చా గోష్టిలు మొదలు పెట్టడం తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. పచ్చ మీడియాగా పేరొందిన ఆ ఛానల్ అధినేతకు కేంద్ర పెద్దల నుంచి వచ్చిన హెచ్చరికలే మార్పునకు కారణమని తెలుస్తోంది. ఈడీని ఎగదోస్తారని భయపడిన సదరు మీడియా చానల్ ఇంతవరకూ ఆరాధించిన నేతకు వ్యతిరేకంగా చర్చ నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Popular News Channel- ED

రేవంత్ పల్లకి మోసి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనూహ్యంగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. అప్పటివరకూ ఉన్న సీనియర్లను కాదని ఆయన టీపీసీసీ పీఠంపై కూర్చొన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన స్వల్ప కాలానికే కాంగ్రెస్ సుప్రీం అయ్యారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలో విమర్శలు, అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. నేతలు అలకపాన్పులు సైతం ఎక్కారు. అయినా రేవంత్ రెడ్డి ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. అయితే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి ఓ పచ్చ మీడియా వెన్నుదన్నుగా నిలిచింది. ఆయన కార్యక్రమాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. ఆయనకు అనుకూలంగా కథనాలు వండి వార్చింది. ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఆ చానల్ ఇచ్చిన ప్రయారిటీ అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ సొంత మీడియా అన్న రేంజ్ లో అయితే ప్రచారం సాగింది.

Also Read: Janasena Chief Pawan Kalyan: ఫైరింగ్ మొదలు పెట్టనున్న పవన్ కళ్యాణ్.. నాదేండ్లది అదే దారి?

రాత్రికి రాత్రే స్వరం మార్చి…
అయితే ఉన్నట్టుండి సదరు పచ్చ మీడియా స్వరం మారిపోయింది. రేవంత్ ను టార్గెట్ చేస్తూ వార్తలు ప్రసారం చేయడం ప్రారంభించింది. ఆయనకు వ్యతిరేకంగా ఒక చర్చా గోష్టిని నడిపింది. దీంతో అటు పొలిటికల్, ఇటు మీడియా వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. సదరు మీడియా అధినేత రేవంత్ కు మంచి మిత్రుడు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి బలపడాలని కోరుకోవడంలో ముందున్న సదరు మీడియా అధినేతలో ఇంత మార్పా అన్న చర్చ ప్రారంభమైంది. అయితే ఈ మార్పు వెనుక ఈడీ భయం ఉందన్న టాక్ నడుస్తోంది. కొందరు బీజేపీ పెద్దలు హెచ్చరికలతో భయపడి రాత్రికి రాత్రే స్వరం మార్చేశారన్న టాక్ అయితే మీడియా వర్గాల్లో ఉంది. ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.

ED

వ్యతిరేకించే వ్యక్తికి అనుకూలంగా..
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం అనుకూలంగా చర్చ పెట్టడంపై కూడా విభిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సదరు చానల్ అంటే రాజగోపాల్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఒక రేంజ్ లో విమర్శలు చేసేవారు. అటువంటిది తనను వ్యతిరేకించిన వ్యక్తికి అనుకూలంగా చర్చాగోష్టిలు పెట్టడంపై పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేతల హెచ్చరికలతో, ఈడీకి భయపడే యూటర్న్ తీసుకున్నారన్న ప్రచారమైతే సాగుతోంది. ఈడీ మోడీ ఇటు మీడియాను సైతం షేక్ చేసిందన్న మాట.

Also Read:China- Taiwan: తైవాన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా? అమెరికా కూడా దిగుతుందా?

Tags