Telangana Elections 2023: తెలంగాణలో మందకొడిగా పోలింగ్‌.. మధ్యాహ్నం వరకు 36.68 శాతమే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 36.68 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా మెదక్‌లో 50.6 శాతం నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో కేవలం 20.79 శాతం నమోదైంది.

Written By: Raj Shekar, Updated On : November 30, 2023 4:14 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నత్తనడకన సాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ మొదలైంది. కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్‌ మొదలైంది. దీంతో మొదటి రెండు గంటల్లో కేవలం 7.75 శాతం మాత్రమే నమోదైంది. అయితే 8 తర్వాత పోలింగ్‌ కాస్త పుంజుకుంది. దీంతో 11 గంటల వరకు పోలింగ్‌ శాతం 20 దాటింది. ఇక 11 గంటల తీర్వాత కూడా అదే తీరులో పోలింగ్‌ సాగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మెదక్‌లో అత్యధికం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 36.68 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా మెదక్‌లో 50.6 శాతం నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో కేవలం 20.79 శాతం నమోదైంది. గ్రేటర్‌ ఓటర్లు ఈసారి కూడా పోలింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపలేదు. సినీ ప్రముఖులు ఓటు వేసినా, యువ టెకీలు మాత్రం గడప దాటడం లేదు.

పోలింగ్‌ శాతం వివరాలను పరిశీలిస్తే..

ఆదిలాబాద్‌ 41.88%
ములుగు 45.69
భద్రాద్రి 39.29%
హనుమకొండ 35.29
నల్లగొండ 39.20
హైదరాబాద్‌ 20.79
నారాయణపేట 42.60
జగిత్యాల 46.14
నిర్మల్‌ 41.74
జనగామ 44.31
నిజామాబాద్‌ 39.66
భూపాలపల్లి 49.12
పెద్దపల్లి 44.45
గద్వాల 49.29
రాజన్న సిరిసిల్ల 39.09
కామారెడ్డి 40.78
రంగారెడ్డి 29.79
కరీంనగర్‌ 40.73
సంగారెడ్డి 42.17
ఖమ్మం 42.93
సిద్దిపేట 44.35
కుమురంభీం 42.77
సూర్యపేట 44.14
మహబూబాబాద్‌ 46.89
వికారాబాద్‌ 44.85
మహబూబ్‌నగర్‌ 44.93
వనపర్తి 40.40
మంచిర్యాలల 42.74
వరంగల్‌ 37.25
మెదక్‌50.80
యాదాద్రి భువనగిరి 45.07
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 26.70