https://oktelugu.com/

Politics: కొత్త ఉద్యమం: కొంపదీసి ఆంధ్రా-తెలంగాణను మళ్లీ కలిపేస్తారా ఏంది?

AP telangana Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీలో ఏ సోయిలో ఉండి ఆ మాట అన్నాడో కానీ.. ఇప్పుడు విడిపోయిన ఏపీ, తెలంగాణను మళ్లీ కలుపాలన్న డిమాండ్ వినిపిస్తోంది.ఈ డిమాండ్ మొదట ఏపీ మంత్రి పేర్ని నాని నుంచే రావడం విశేషం. ఏపీలో పోటీచేసే బదులు రెండు రాష్ట్రాలను కలపవచ్చు కదా అని ఆయన సెటైర్ వేశారు. అంతటితో ఆగని ఈ మాటల వానకు తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2021 6:11 pm
    Follow us on

    AP telangana Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీలో ఏ సోయిలో ఉండి ఆ మాట అన్నాడో కానీ.. ఇప్పుడు విడిపోయిన ఏపీ, తెలంగాణను మళ్లీ కలుపాలన్న డిమాండ్ వినిపిస్తోంది.ఈ డిమాండ్ మొదట ఏపీ మంత్రి పేర్ని నాని నుంచే రావడం విశేషం. ఏపీలో పోటీచేసే బదులు రెండు రాష్ట్రాలను కలపవచ్చు కదా అని ఆయన సెటైర్ వేశారు.

    telangana_ap

    telangana_ap

    అంతటితో ఆగని ఈ మాటల వానకు తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి జత కలిశాడు. తెలంగాణ విడిపోయి ఎవరి సంసారం వాళ్లు చేసుకుంటుంటే మరోసారి జగ్గారెడ్డి సమైక్యవాదం వినిపించడం విశేషం. విడిపోయి నష్టపోయామని ఉమ్మడిగా ఉన్నప్పుడే బాగుండేదని.. మళ్లీ ఏపీ తెలంగాణ కలుపాలని ఆయన డిమాండ్ చేయడం విశేషం.

    సీఎం కేసీఆర్ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని జగ్గారెడ్డి సంచలన ప్రతిపాదన చేశారు. తాను తెలంగాణ ఉద్యమంలోనూ సమైక్యవాదాన్నే వినిపించానని.. అందరూ తెలంగాణ ద్రోహి అన్నా ఎమ్మెల్యేగా గెలిచానని.. పార్టీకి సంబంధం లేకుండా ఆంధ్రా, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తేవాలని వింత డిమాండ్ చేశారు. ఏ ప్రాంతానికి నేను వ్యతిరేకం కాదన్నారు. ఇది ప్రజల డిమాండ్ కాదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.రాయలసీమ వారే తెలంగాణలో కోటి మంది ఉన్నారని తెలిపారు.

    కేసీఆర్ , జగన్ కలిసే ఉమ్మడి రాష్ట్రం యోచన చేస్తున్నారని.. జగన్ జైలుకు వెళితే ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకుంటున్నాడని రేవంత్ సైతం బాంబు పేల్చారు. రాజ్యవిస్తరణ, అపార ఖనిజ సంపదపై కన్నేసే కేసీఆర్ ఈ ప్రతిపాదన తెచ్చాడని రేవంత్ ఆరోపించారు.

    ఇలా ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఆంధ్రాను కలుపాలని నేతలు కోరుకుంటుండడం.. కేసీఆర్ ఆశ చూపడం.. పేర్ని నాని సమర్థించడం.. జగ్గారెడ్డి సై అనడం చూస్తుంటే మళ్లీ ఉమ్మడి రాష్ట్ర ఆశ మొదలవుతుందా? రాష్ట్రం కలుస్తుందా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.ఒక్కసారి విడిపోయాక కలవడం కష్టమే అయినా నేతలు మాత్రం ఆ ఉబలాటను వ్యక్తం చేయడం.. విడిపోయి చెడిపోయామన్న బాధను వ్యక్తపరచడం విశేషం.