Analysis on National Politics: దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల డీఎన్ఏ ఒక్కటే. ఎందుకంటే ఎక్కడ చూసినా తెలంగాణ, ఆంధ్రా, బెంగాల్, తమిళనాడు అయినా ప్రాంతీయ పార్టీలు మాట్లాడే భాష, వ్యవహరించే తీరు అన్ని ఒకేలా ఉంటాయి. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రాంతీయ పార్టీలు అనేవి బహు తక్కువ. కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, జన్ సంఘ్, కమ్యూనిస్టులు, తృణమూల్, అన్నాడీఎంకే, డీఎంకే లు రాజకీయ రంగాన్ని ఏలాయి.
రానురాను ప్రాంతీయ పార్టీలు బలహీనపడిపోయాయి. ఒక్క బీజేపీ తప్పితే ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలను ఏలడం మంచిదేనా? అంటే మంచిది కాదు. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల క్యారెక్టర్ లను చూస్తే… ఆత్మగౌరవం నినాదంతో వీరి డిమాండ్ మొదలవుతుంది. మా ప్రజలకు అన్యాయం జరిగిందని వాళ్లు గళమెత్తుతారు.
దేశం మొత్తం ఒక ఎత్తు.. మా ప్రాంతంలో మాత్రం అన్యాయం జరుగుతుందన్న భావనను ప్రాంతీయ పార్టీలు మొదట్లో రెచ్చగొడుతారు. ప్రజలకు నిజంగానే ఇది నమ్మేలా చేస్తాయి. కేంద్రంలోని ప్రభుత్వం చేసే తప్పులు.. వాటి నిర్ణయాలతో ఏర్పడే అసమానతలను ఎత్తి చూపుతారు. అవి ఈ ప్రాంతీయ పార్టీలు మాట్లాడడానికి కావాల్సిన సరంజామాను క్రియేట్ చేస్తాయి. అంతవరకూ బాగానే ఉంది.
Also Read: ఆర్టికల్ 370 డి రద్దుతో మోడీ సాధించేంటి? కశ్మీర్ లో వచ్చిన మార్పేంటి?
రానురాను ఇది ప్రాంతీయ పార్టీలను ఆ రాష్ట్రంలో బలంగా మార్చి ఏకవ్యక్తి పాలన కిందకు తెచ్చి వాళ్ల కుటుంబ పరిపాలనను స్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. తమిళనాడు నుంచి జమ్మూకశ్మీర్ వరకూ ఇదే కథ. ప్రాంతీయ పార్టీల డీఎన్ఏ ఎక్కడ చూసుకున్నా ఇదే..
మొదట్లో వాళ్ల ఉద్దేశం బాగానే ఉండొచ్చు.తర్వాత మా కుటుంబమే ఈ ప్రాంతాన్ని పాలించాలని సొంత ఆస్తిలా దాన్ని భావిస్తారు. ప్రాంతీయవాదం పేరుతో నిసిగ్గుగా కుటుంబ పాలన చేస్తున్న ప్రాంతీయ పార్టీల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
Also Read: అమరావతి సాకారం వెనుక ‘బీజేపీ-జనసేన’
Recommended Video: