https://oktelugu.com/

TTD Ticket Rates: తిరుమల వెళ్లే వీఐపీలకు షాకిచ్చిన టీటీడీ..? ఈ గగ్గోలేంటి?

TTD Ticket Rates: తిరుమల భక్తులపై ఆర్థిక భారం మోపారని.. వందల్లో ఉన్న రేట్లను వేలకు పెంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు, ఆ అనుకూల మీడియా వైసీపీ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరైతే మతకోణం వెలికి తీసి మరీ జగన్ సర్కార్ పై ఆడిపోసుకుంటున్నారు. క్రిస్టియానిటీ పాటిస్తున్న జగన్ ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ నిజం ఏంటంటే పెంచింది పేదలు, మధ్యతరగతి వారు దర్శించుకునే టికెట్లు కావు. ఆ విషయం తెలియక అందరూ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2022 / 07:33 PM IST
    Follow us on

    TTD Ticket Rates: తిరుమల భక్తులపై ఆర్థిక భారం మోపారని.. వందల్లో ఉన్న రేట్లను వేలకు పెంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు, ఆ అనుకూల మీడియా వైసీపీ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరైతే మతకోణం వెలికి తీసి మరీ జగన్ సర్కార్ పై ఆడిపోసుకుంటున్నారు. క్రిస్టియానిటీ పాటిస్తున్న జగన్ ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ నిజం ఏంటంటే పెంచింది పేదలు, మధ్యతరగతి వారు దర్శించుకునే టికెట్లు కావు. ఆ విషయం తెలియక అందరూ విమర్శలు చేస్తున్నారు.

    TTD Ticket Rates

    నిజానికి టీటీడీ తీసుకున్న నిర్ణయం సామాన్య భక్తులకు ఆ తిరుమలేషుడి దర్శనాన్ని మరింత ఎక్కువ చేయడానికే. తాజాగా టీటీడీ బోర్డు సమావేశం వీడియోలు బయటకొచ్చాయి. అందరూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీరుపై మండిపడ్డారు. ధరలు పెంచారని ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. టీటీడీ భక్తులపై పెను భారం మోపి ఎడాపెడా బాదేసిందని గగ్గోలు పెడుతున్నారు.

    కానీ టీటీడీ పెంచింది సామాన్యులు దర్శించుకునే రూ.50, రూ.300 టికెట్లు అస్సలు కాదు. కేవలం సిఫారసులతో వచ్చే వీఐపీలు దర్శించుకునే ఆర్జిత సేవల టికెట్ ధరలే. వీఐపీలు దర్శించుకునే సుప్రభాతం, అర్చన, తోమాల టికెట్ల ధరలను భారీగా పెంచారు. వీరంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రముఖులు చేసే సిఫారసు ఉత్తరాల ద్వారా పొందే భక్తులకు ఈ ధరలను భారీగా పెంచారు. వీరు వేలల్లోనే ఉంటారు. లక్షల్లో వచ్చే సామాన్య భక్తులకు వీరివల్ల దర్శనం ఆలస్యమవుతోంది. వీఐపీలకు ఆర్థిత సేవా టికెట్ ధరలు కూడా వీటికి తక్కువగా ఉన్నాయి.

    Also Read: మోడీది ఏం తప్పులేదా? ఆ రెండు పత్రికలదే తప్పా?

     

    అందుకే 1000లోపే ఉన్న ఆర్థిత సేవల టికెట్లను భారీగా పెంచారు. సుప్రభాతం టికెట్ ను రూ.2000 చేయాలని.. అర్చన, తోమాల టికెట్లను రూ.5000 చేయాలని టీటీడీ నిర్ణయించింది. కల్యాణోత్సవం టికెట్లను కూడా భారీగా పెంచాలని నిర్ణయించారు.

    ఇలా సిఫారసు లేఖలతో వచ్చే వీఐపీలకు మాత్రమే టికెట్ ధరలు పెంచారు. కానీ దీన్ని సామాన్యులకు పెంచినట్టుగా టీడీపీ నేతలు, మీడియా గగ్గోలు పెడుతోంది. సామాన్య భక్తులకు పెను భారం మోపారని అంటున్నారు. సామాన్యులకు మరింత దర్శనం కోసమే వీఐపీలకు పెంచారన్న విషయాన్ని ఇక్కడ మరిచిపోరు.

    Also Read: రష్యా, ఉక్రెయిన్.. ఎవరి సత్తా ఎంత? సైన్యం బలాబలాలివీ!