Dharmana Brothers: ఆయన సుదీర్ఘ కాలం ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం అదే శాఖకు ప్రాతినిధ్యం వహించారు. ఆ శాఖ ఆటుపోట్లు తెలుసు. వైఫల్యాలు తెలుసు. అటువంటి వ్యక్తి తన సొంత శాఖకే అవినీతి మరక అంటించేశారు. తన హయాంలో అవినీతి అన్నదే లేదని.. ఈ మూడేళ్లలోనే అవినీతి జడలు విప్పిందన్న రేంజ్ లో ఆరోపణలు చేశారు. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసిందెవరో తెలుసా? రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇటీవల మంత్రి విస్తరణలో భాగంగా అమాత్యుడైన ధర్మాన ప్రసాదరావు మీడియా ముందు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో ఆయన సోదరుడు ధర్మాన క్రిష్టదాస్ నొచ్చుకున్నారు. ఆంతరంగీకుల వద్ద కన్నీటిపర్యంత మయ్యారు. తనపై అవినీతి ముద్ర వేసిన సోదరుడుపై అసంత్రుప్తితో ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ధర్మాన ప్రసాదరావు స్వాగత వేడుకలకు సైతం క్రిష్టదాస్ ముఖం చాటేశారు. నైరాశ్యంలోకి వెళ్లిపోయిన ఆయన రాజకీయంగా కూడా సైలెండ్ అయిపోయారు. అయితే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు వెనుక రాజకీయ ప్రతీకారేచ్ఛ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తొలి మంత్రివర్గం నుంచే..
2019 తొలి కేబినెట్ లోనే మంత్రి పదవి దక్కుతుందని ధర్మాన ప్రసాదరావు భావించారు. కానీ జగన్ ఆయనకు హ్యాండిచ్చి సోదరుడు క్రిష్టదాస్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన రెవెన్యూ శాఖతో పాటు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నడవడం, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు తనకు పెట్టిన ఇబ్బందులను ద్రుష్టిలో పెట్టుకొని సీఎం జగన్ క్రిష్ణదాస్ ను బాగా ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో ధర్మాన సోదరుల మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. కుటుంబసభ్యుల మధ్య సైతం ఏమంత సఖ్యత లేదు. జిల్లా కేంద్రానికి ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు సోదరుడు క్రిష్ణదాస్ హాజరయ్యే సమావేశాలకు దూరంగా ఉండిపోయేవారు. జిల్లాకు వైసీపీ కీలక నేతలు వచ్చే సమయంలో కూడా ముఖం చాటేసేవారు. అయితే సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన రెవెన్యూ శాఖ తన సోదరుడి వద్ద ఉన్నా.. ఏ రోజూ సలహాలు, సూచనలు ఇచ్చిన పాపాన పోలేదు. క్రిష్ణదాస్ సైతం ఏ రోజూ అడగ లేదు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో గట్టెక్కాలంటే ధర్మాన ప్రసాదరావు అవసరం అనివార్యంగా మారింది. ఒక వేళ ఆయనకు మంత్రిగా అవకాశం ఇవ్వకుంటే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి డ్యామేజ్ అని సర్వేలు తెలపడంతో జగన్ తప్పనిసరి స్థితిలో ధర్మాన ప్రసాదరావుకు అవకాశమిచ్చారు. అప్పటివరకూ సోదరుడు క్రిష్ణదాస్ నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖనే కట్టబెట్టారు. దీంతో సోదరుడు క్రిష్ణదాస్ వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్న ప్రసాదరావు తాను సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన రెవెన్యూ శాఖకు అవినీతి మరలు అంటించేశారు. తద్వారా సోదరుడు క్రిష్ణదాస్ అత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు.

Also Read: CM Jagan: కుల సమీకరణాల ఆధారంగానే పార్టీ బాధ్యతలు.. ఇదేం తీరు జగన్..?
ఉద్యోగవర్గాల్లో చర్చ
మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. దీనిపై రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇప్పటికే స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. కానీ ధీటుగా స్పందించలేకపోయారు. అయితే రెవెన్యూ శాఖలోని దిగువ స్థాయి సిబ్బంది మాత్రం మంత్రి వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్నారు. రెవెన్యూ శాఖ ఎంత క్లిష్టమైనదో.. ఎన్ని చిక్కుముళ్లు ఉంటాయో మంత్రికి తెలుసునని.. కానీ రాజకీయంగా సోదరుడ్ని టార్గెట్ చేయడానికి శాఖను వినియోగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజకీయంగా తన వెంట ముందుగా నడిచిన క్రిష్ణదాస్ కు సీఎం జగన్ అన్యాయం చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్రిష్ణదాస్ అభిమానులు కూడా కోపంతో రగిలిపోతున్నారు. నాడు సోదరుడు, అప్పటికే మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావుతో విభేదించి ఎమ్మెల్యే పదవిని క్రిష్ణదాస్ వదులుకున్నారు. తనపైనే మరో సోదరుడు రామదాసును ప్రసాదరావు పోటీకి దింపారు. అయినా ప్రజాభిమానంతో గెలుపొందిన తనకు ఇప్పటివరకూ మంచి స్థానమే కల్పించారని క్రిష్ణదాస్ భావించారు. కానీ తనపై పగతో అవినీతి వ్యాఖ్యలు చేస్తున్న ధర్మాన ప్రసాదరావుపై మాత్రం క్రిష్ణదాస్ గుర్రుగా ఉన్నారు. కానీ పార్టీ కట్టుబాట్లతో మౌనంగా భరిస్తున్నారు. అయితే ధర్మాన సోదరుల వ్యవహారం ఎటుదారితీస్తుందోనన్న భయంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ శ్రేణులను భయపెడుతోంది.
Also Read: Chiranjeevi Acharya Pre Release Event: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి ఎవరో తెలుసా?
[…] […]