Vangalapudi Anitha: ఈ మధ్యన ఏపీ మహిళా నేతల దూకుడుకు కళ్లెం పడుతోంది. మంత్రి రోజా విషయంలో జరిగింది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఆ వంతు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు వచ్చింది. అనితకు పోలీసులు చుక్కలు చూపించారు. ఓ మహిళ ఎస్పీ అనిత దూకుడుకు చెక్ పెట్టారు. సాధారణంగా అనిత సంగతి అందరికీ తెలిసిందే.గతంలో పోలీసుల కళ్ళు కప్పి నిరసన కార్యక్రమాల్లో హాజరైన సందర్భాలు ఉన్నాయి. అటువంటి అనిత కే పోలీసులు జలక్ ఇచ్చారు. ఆమె ఓవర్ యాక్షన్కు గట్టి దెబ్బ కొట్టారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రెండు రోజుల కిందట అనకాపల్లి జిల్లా స్పందన విభాగం వద్ద ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. దీంతో పాయకరావుపేట నియోజకవర్గం చెందిన అనిత ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. విశాఖలో తన నివాసం నుంచి బయలుదేరేందుకు సిద్ధపడ్డారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఆమెకు జలక్ ఇచ్చారు. వైజాగ్ డాక్టర్స్ కాలనీ లో ఉన్న ఆమె నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. గృహనిర్బంధం చేశారు.
సాధారణంగా అనితను కట్టడి చేయాలంటే కత్తి మీద సామే. గతంలో చాలా సందర్భాల్లో ఆమె పోలీసులపైనే విరుచుకుపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో అనితను కంట్రోల్ చేయడానికి ఓ మహిళా ఎస్పీని రంగంలోకి దించారు. అనిత రకరకాల ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినా ఆ మహిళ ఎస్పీ వినలేదు. అసలు మీరు ఎందుకు వచ్చారు? ఏమైంది? మా ఇంటి గేట్లు ఎందుకు వేస్తున్నారు? విషయం చెప్పండి? అని అడుగుతూ అనిత జులుం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా స్పందన కార్యక్రమానికి నేను వెళ్తే మీకు వచ్చిన సమస్య ఏంటి అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సదరు మహిళ ఎస్పీ అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. నోటీసులు జారీ చేశారు. అయినా సరే అనిత పెడచెవిన పెడుతూ వచ్చారు. మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుంది. దయచేసి నోటీసులు తీసుకోండి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు. అని సదరు మహిళా ఎస్పీ అనేసరికి అనిత తోక ముడుచుకోవాల్సి వచ్చింది.