Cono Corpus Plant: ఆ మొక్కలు చూసేందుకు అందంగా ఉంటాయి. నాటితే ఏపుగా పెరుగుతుంటాయి. కొద్ది రోజుల్లోనే మొత్తం కమ్మేస్తాయి. చల్లని గాలినిస్తాయి. సేద తీరేందుకు మంచి నీడను కూడా ఇస్తాయి. కానీ అవి నిషేధిత మొక్కలు. వాటి గాలి పీల్చితే ఇబ్బంది. ముట్టుకుంటే ఎలర్జీ. నీడన ఉంటే శ్వాస కోసం ఇబ్బందులు.. ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద పెరిగే విషపు మొక్క అది. దాని పేరు కోనో కార్పస్.. బుద్ధి గల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానిని తెలంగాణ హరితహారం పేరుతో విస్తృతంగా నాటింది. అది నిషేధిత మొక్క అని తెలిసినప్పటికీ కూడా.. ఇప్పుడు తలకాయ పట్టుకుంటుంది.. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మారుమూల పల్లెల దాకా ఇప్పుడు ఆ మొక్కలు విస్తృతంగా పెరిగిపోయాయి.. ఆ మొక్కలు నాటేందుకు ఎంత ప్రయాసపడ్డారో… తొలగించేందుకు కూడా అంతటి ప్రయాస పడాల్సి ఉంటుంది.
ఇది అమెరికా మొక్క
కోనో కార్పస్ మొదట్లో అమెరికా తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన మొక్క. ముఖ్యంగా ఇది ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో మాంగ్రువ్ జాతి మొక్కగా దీన్ని పిలుస్తారు. ఏపుగా, వేగంగా పెరిగే సామర్థ్యం దీనికి ఉంటుంది.. అప్పట్లో ఈ మొక్కను అరబ్ దేశాల్లో విస్తృతంగా నాటారు. నాటిన కొద్ది కాలానికి ఎడారి దేశంలో పచ్చదనం వెల్లి విరిసింది. ఆయా దేశాలను సందర్శించిన మన ప్లాంటేషన్ నిపుణులు దీనిని భారతదేశానికి తీసుకొచ్చారు. అలాగా గ్రామాలు, పట్టణాల్లో ఈ మొక్క పాతుకు పోయింది.. ఆ తర్వాత గాని అసలు విషయం అర్థమైంది.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆ దేశాలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి
ఎడారి దేశంలో పచ్చదనాన్ని ప్రసాదించిన ఈ మొక్క.. పాకిస్తాన్, ఇరాన్ ప్రభుత్వాలను కూడా ఆకట్టుకుంది. క్రమంగా కోనో కార్పస్ దుష్ప్రభావాలను గుర్తించి కువైట్, ఖతార్, యూఏఈ దేశాలు దీనిని నిషేధించాయి.. మన పురుగును ఉన్న పాకిస్తాన్ కూడా ఈ మొక్క దుష్ప్రభావాలను తీవ్రంగా ఎదుర్కొంది.. ముఖ్యంగా ఆ దేశంలో డ్రైనేజీ, తాగునీరు పైపులైన్ల వ్యవస్థను ఈ మొక్క కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ముఖ్యంగా కరాచీ నగరంలో పీల్చే గాలి నాణ్యత పై తీవ్ర ప్రభావం చూపింది. కరాచీ యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగం ఈ విషయాన్ని నిర్ధారిస్తూ దేశంలో ఆస్తమా రోగులు పెరిగేందుకు ఈ మొక్కే కారణమని తేల్చపడేసింది.. ఇరాన్లో ఈ మొక్క వల్ల మౌలిక వసతులకు కలిగిన నష్టాలపై మిసాన్ విశ్వవిద్యాలయం 2020లో ఏకంగా ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించింది.
ఆరోగ్యం దెబ్బతింటుంది
కోనో కార్పస్ వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మడ జాతి మొక్క కాబట్టి దీని పుప్పోడి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. పశువులు, పక్షులకు ఈ మొక్క వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఈ చెట్లు జీవ వైవిధ్యానికి తీవ్ర ముప్పుగా ఉంటాయి. కోవిడ్ బారిన పడి కోరుకున్న వారికి కోనో కార్పస్ మొక్కల వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉంటుంది.. ప్రభుత్వం ఈ మొక్క పెంపకం పై నిషేధం విధించినప్పటికీ.. ఇప్పటికే నాటిన మొక్కలు పెరిగి పెద్దవయ్యాయి.. వీలైనంత తొందరలో వాటిని తొలగించాలి.
తెలంగాణ హరితహారం లో విస్తృతంగా నాటారు
కబ్రాటేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క దేనికీ పనికిరాదు. దీని ఆకులు పశువులు తినవు. పక్షులు ఈ చెట్టుపై వాలవు. కీటకాలు దీని దరి చేరవు. చివరకు దీని నీడన గడ్డి కూడా పుట్టదు.. భూగర్భ జలాలను ఇది అధికంగా వినియోగించుకుంటుంది. భూమిలోపల తన వేర్లకు అడ్డువచ్చే పైపులైన్లను కూడా ఈ మొక్క వదిలిపెట్టదు. ఎక్కడికక్కడ చొచ్చుకుని వెళుతుంది.. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ముందు చూపు లేకుండా ఈ మొక్కలను విస్తృతంగా నాటింది.. ఈ విషపు మొక్క తెలంగాణ మొత్తం పాతుకుపోయింది.. అయితే దీని ప్రభావాలను గుర్తించిన ప్రభుత్వం గత ఏడాది జూన్ 15న నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. కానీ అధికారులు బేఖాతరు చేస్తూ విస్తృతంగా నాటారు. తాజా అధ్యయనాల నేపథ్యంలో వీటిని తొలగించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.