PM Narendra Modi Serious Comments On Congress: కాంగ్రెస్ ను పార్లమెంట్ సాక్షిగా కడిగిపారేశాడు ప్రధాని మోడీ.. ఈ క్రమంలోనే ఒక కీలక పాయింట్ ను బయటపెట్టాడు. కాంగ్రెస్ వైఫల్యాలతోపాటు గోవా రాష్ట్రాన్ని దేశాన్ని కలుపుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని మోడీ ఎండగట్టారు. ఇదో కొత్త కోణం. దాదాపు స్వాతంత్ర్యం వచ్చాక 17 ఏళ్లు అయ్యాక గోవాను దేశంలో కలుపుకున్న విధానాన్ని మోడీ విమర్శల్లో కీలక పాయింట్..
పండిట్ నెహ్రూ గోవాపైకి సైనిక చర్య దిగడానికి వెనుకడాడని.. రాంమనోహర్ లోహియా గోవా విముక్తి కోసం ఎంతో కొట్లాడాడని మోడీ వివరించారు. కాంగ్రెస్ వారసత్వం వల్ల దేశం భ్రష్టు పట్టిందని.. దాన్ని కడిగిపారేశారు. శశిథరూర్ మాట్లాడిన దాంట్లో 1/100వ వంతు కూడా రాహుల్ మాట్లాడలేకపోయాడు. అసలు రాహుల్ లో అపరిపక్వతను మోడీ బయటపెట్టాడు.
కాంగ్రెస్ మసకబారుతనమే దానికి శాపంగా చెప్పొచ్చు. ఫుల్ అటాక్ మోడ్ లో మోడీ విరుచుకుపడుతుంటే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సైలెన్స్ గా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఏ ప్రతిపక్ష పార్టీ నిన్న నోరువిప్పకపోవడం గమనార్హం.
ఇక పార్లమెంట్ లోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మోడీ మాటలకు వాకౌట్ చేసేసింది. కానీ మిగతా ప్రతిపక్షాలు వాళ్లతో కలిసి వాకౌట్ చేయలేదు. మోడీ మాటలను శ్రద్ధగా విన్నారు. మోడీ మాటల్లో నిజాలు ఉన్నాయి కాబట్టే ప్రతిపక్షాలు ఇలా గమ్మున ఉన్నాయా? కాంగ్రెస్ నిజంగానే అంత దిగజారిపోయిందా? అన్నదానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణ కింది వీడియోలో చూడొచ్చు.