
PM Narendra Modi: కేంద్రంలో ప్రధాని మోడీ చరిష్మా తగ్గిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ లాంటి ఐదు స్టేట్ల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని అందరిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రానురాను మోడీ ఇమేజ్ తగ్గుతోందని తెలుస్తోంది. ఆయన సమర్థతతపై అప్పుడే అందరిలో అనుమానాలు వస్తున్నాయి. పార్టీ నేతలు కూడా లోలోపల కుమిలిపోతున్నా బయటకు మాత్రం వెల్లడించడం లేదు. ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని టాక్. దీంతో ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదేమోననే సందేహం వస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తితో కేంద్ర ప్రభుత్వం అప్రదిష్టను మూటగట్టుకుంది. దాని ఎఫెక్ట్ తో మోడీ పాలనపై పెద్దగానే చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గట్టెక్కాలని భావించినా ప్రజల మద్దతు కచ్చితంగా ఉండాల్సిందే. దీంతో ప్రభుత్వం ఎలాగైనా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో యోగిపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయనను మార్చాలని ప్రయత్నించినా అది కుదరడం లేదు. ప్రభుత్వం కన్నా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులే పేదలను లాక్ డౌన్ సమయంలో ఆదుకున్నాయని విమర్శలు వచ్చాయి.
ధరలు కూడా ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. నిత్యావసర సరుకుల ధరలు నింగినంటడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రో ధరలు విపరీతంగా పెరిగి రూ. వంద మార్కు దాటేయడంతో సామాన్యుడిపై పెను భారం పడుతోంది. దీనికి తోడు గ్యాస్ ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందని సమాచారం.
ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది. కరోనా సమయంలో లక్షల కోట్ల రూపాయలు సాయం అంటూ ప్రకటనలకే పరిమితమైపోయారని తెలుస్తోంది. ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో మోడీ ఇమేజ్ పడిపోయిందని సమాచారం. త్వరల జరిగే ఐదు స్టేట్ల ఎన్నికల్లో కచ్చితంగా మోడీ పాలనపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.