Modi-Rushi sunak : వారిద్దరూ రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలకు ప్రధానులు.. కానీ ఈ ఇద్దరూ ఒకే దేశానికి చెందిన వారు కావడం విశేషం. భారత ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ల కలయిక అందరినీ ఆకట్టుకుంది. రిషి సునాక్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తి కావడం.. మనల్ని పాలించిన బ్రిటన్ కు పాలకుడిగా ఉండడం.. ఈ ఇద్దరూ కలవడం అరుదైన కలయికగా మారింది.

జీ20 సమ్మిట్ 17వ ఎడిషన్ సందర్భంగా మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించిన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని రిషి సునక్ పాల్గొన్న తొలి అంతర్జాతీయ సమావేశంలో.. ఇందులోనే పాల్గొన్న భారత ప్రధాని మోడీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. “బాలీలో మొదటి రోజు సందర్భంగా ప్రధానమంత్రులు మోడీ -రిషి సునాక్ లు ముచ్చటించుకున్నారు. ఈ మేరకు వీరి ఫొటో విడుదల చేయగా వైరల్ అయ్యింది.
ఇరువురు నేతల మధ్య ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. అంతకుముందు, అక్టోబర్‌లో పీఎం మోడీ -సునక్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య “సమతుల్య మరియు సమగ్ర” స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై చర్చించారు.
ప్రధాని మోదీ సోమవారం బాలి చేరుకుని రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్, నెదర్లాండ్ ప్రధాని మార్క్ రుట్టే, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌లను కలిశారు. “ఆఫ్రికాలో ఒక ముఖ్యమైన అభివృద్ధి భాగస్వామితో చర్చలు జరిపారు. సెనెగల్ అధ్యక్షుడు.. ఆఫ్రికన్ యూనియన్ ఛైర్మన్ సాల్ తో మోడీ చర్చలు జరిపారు.
ఈరోజు ప్రధాని మోదీ ఆహారం – ఇంధన భద్రత సెషన్‌పై జీ20 వర్కింగ్ సెషన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగాలని భారతదేశం దీర్ఘకాల వైఖరిని మోడీ పునరుద్ఘాటించారు. “ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణతోపాటు దౌత్యం మార్గానికి తిరిగి రావడానికి ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉందని మోడీ పిలుపునిచ్చారు.
“గత శతాబ్దంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచంలో విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత శాంతి మార్గంలో పట్టేందుకు నాటి నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. కొత్త ప్రపంచ వ్యవస్థను సృష్టించే బాధ్యత కోవిడ్ అనంతర కాలం మన భుజాలపై ఉంది. ప్రపంచంలో శాంతి, సామరస్యం మరియు భద్రతను పెంపొదించడం ఈ సమయంలో అవసరం ” అని మోడీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాడు.
Glad to see you PM @RishiSunak. Looking forward to working together in the times to come. @10DowningStreet pic.twitter.com/lvnW3PXd1N
— Narendra Modi (@narendramodi) November 15, 2022